Disha App First Distress Call: దిశ యాప్ దుమ్మురేపింది, నిమిషాల వ్యవధిలో ఆకతాయి అరెస్ట్, అధికారుల్ని, పోలీసుల్ని అభినందించిన ఏపీ సీఎం వైయస్ జగన్, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Andhra Pradesh Visakhapatnam professor held after AP Police received first distress call on Disha app (photo-PTI)

Amaravati, Febuary 12: ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దిశా యాప్ (Disha App) ద్వారా తొలి విజయం నమోదయింది.ఓ మహిళ ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు నిమిషాల వ్యవధిలోనే ఆకతాయిని అరెస్ట్ చేశారు. ఈ విజయం ద్వారా తద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా ఇచ్చినట్లయింది. కాగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (Ap Cm YS Jagan Mohan Reddy) చేతుల మీదుగా ఈ నెల 8న దిశ యాప్‌ ప్రారంభమైన విషయం విదితమే.

Disha App Download Link

మంగళవారం తెల్లవారుజామున ఓ మహిళా అధికారి విశాఖపట్నం (Vizag) నుంచి విజయవాడకు బస్సులో వెళ్తుండగా.. అదే బస్సులో ప్రయాణిస్తున్న ప్రొఫెసర్ బసవయ్య ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇటీవల ప్రభుత్వం ప్రారంభించిన దిశా యాప్ ఓపెన్ చేసిన బాధితురాలు.. వెంటనే ఎస్ఓఎస్ ద్వారా (SOS to Disha app) పోలీసులకు సమాచారం అందించింది.

దీంతో తెల్లవారుజామున 04.21 నిమిషాలకు మంగళగిరి దిశా కాల్ సెంటర్‌కు ఎస్ఓఎస్ కాల్ వెళ్లింది. అక్కడ్నుంచి కాల్ సెంటర్ ద్వారా దగ్గరలోని ఎమర్జెన్సీ సెంటర్‌కు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన ఏలూరు త్రీటౌన్ పోలీసులు 04.27 నిమిషాలకు బాధితురాలి వద్దకు చేరుకున్నారు. సదరు మహిళ అధికారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్ బసవయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

Here's Home Minister Tweet

తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన కాలోతు బసవయ్య నాయక్‌ విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీలో కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా (Visakhapatnam professor) పని చేస్తున్నాడని తెలిసింది. బాధితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఏయూ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ కె.బసవయ్య నాయక్‌పై ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ కింద కేసు నమోదైనట్లు సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్‌ తెలిపారు. అనంతరం పెదపాడు పోలీస్‌ స్టేషన్‌కు రిఫర్‌ చేయడంతో క్రైమ్‌ నెంబర్‌ 52/2020 సెక్షన్‌ 354, 354(ఏ) కింద కేసు నమోదు చేశారు.

శాసనసభలో ఏపీ దిశ బిల్లుకు అమోదం

బసవయ్య నాయక్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్టు పోలీసులు తెలిపారు. ఏలూరు (Eluru) రూరల్‌ సీఐ శ్రీనివాసరావు కేసును దర్యాప్తు చేస్తున్నారు. వర్సిటీలో ఇనార్గానిక్, అనలిటికల్‌ విభాగాధిపతిగా విధులు నిర్వహిస్తున్న బసవయ్యపై చర్యలు తీసుకుంటామని ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి తెలిపారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి ఆకతాయి ప్రొఫెసర్‌ అరెస్టు వరకు దిశ ప్రత్యేకాధికారి దీపిక పాటిల్‌ పర్యవేక్షించారు.

Here's AP CM Launch AP Disha App & Police station Tweet

మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన డీజీపీ గౌతమ్ సవాంగ్ (DGP Gowtham Sawang) ఘటన గురించి వివరించారు. యాప్ పనితీరు.. మహిళను ఎలా రక్షించారన్న అంశాలపై క్లారిటీ ఇచ్చారు. డీజీపీ ప్రజెంటేషన్ తర్వాత జగన్ ఆనందంతో చప్పట్లు కొట్టి పోలీసుల్ని అభినందించారు.

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే

పోలీసులు అతి తక్కువ సమయంలో స్పందించి ఆపదలో ఉన్న మహిళకు అండగా నిలిచారని ప్రశంసించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పోలీసులను కోరారు.

ఏపీలో ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్

ఏపీ సీఎం వైయస్ జగన్ తన ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఆపదలో ఉన్న ఓ మహిళ దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారాన్ని అందించింది.. SOS బటన్ నొక్కిన 7నిమిషాల్లోనే పోలీసులు అక్కడికి చేరుకోవడం.. వెంటనే ఆ మహిళకు రక్షణ కల్పించి.. కేసును నమోదు చేయడం దిశ యాప్ పనితీరుకు చక్కని ఉదాహరణగా నిలిచింది అన్నారు.