Rajahmundry, Febuary 8: మహిళల రక్షణ కోసం రూపొందించిన దిశ చట్టం సమర్థవంతంగా అమలయ్యేలా ఏపీ సర్కార్ అడుగులు వేసింది. ఇందులో భాగంగా మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలు కోసం రాజమహేంద్రవరంలో ‘దిశ’ తొలి పోలీస్ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. అమరావతి ఎక్కడికీ పోదు
మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు.
కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్ సిబ్బంది ఉంటారు.
Here's ANI Tweet
Andhra Pradesh: Chief Minister YS Jagan Mohan Reddy today inaugurated Disha Mahila Police Station in Rajahmundry. pic.twitter.com/CXobN4rr8X
— ANI (@ANI) February 8, 2020
దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించాయి.
Here's Rajahmundry YSRCP MP Tweet
Hon'ble Chief Minster Sri YS Jaganmohan Reddy will be
Inaugurating of DISHA police station & interaction with concerned officials at Rajahmundry today@ysjagan @AndhraPradeshCM @ndtv @TimesNow @the_hindu @htTweets @CNNnews18 @timesofindia @DeccanChronicle @IndiaToday@aajtak pic.twitter.com/LKoMCNAXay
— MARGANI BHARAT RAM (@BharatYSRCP) February 8, 2020
21 రోజుల్లోనే దర్యాఫ్తు పూర్తి, శిక్ష
మహిళలు, బాలికలపై దారుణాలకు తెగబడే వారికి కఠిన శిక్షలు విధిస్తూ ఏపీ ప్రభుత్వం దిశ యాక్ట్ తీసుకొచ్చింది. దీనికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన దిశ చట్టం.. కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. దిశ చట్టాన్ని వీలైనంత త్వరగా అమలు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీ స్థాయిలో ప్రయత్నిస్తోంది.
CMO Andhra Pradesh Tweet
రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. pic.twitter.com/AJx3t6Rmei
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 8, 2020
అన్నీ అబద్దాలే, మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు
ఈ చట్టంలోని కొన్ని అంశాలపై మరింత వివరణ కోరడంతో... ఆ వివరాల్ని కూడా కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ చట్టం అమల్లోకి వస్తే... 14 రోజుల్లో విచారణ పూర్తి చేసి, దోషులకు 21 రోజుల్లోనే శిక్ష వేస్తారు. మహిళలకు భరోసా కల్పించేలా ఈ చట్టం ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.
దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్
దిశ చట్టంలో ప్రత్యేకతలు ఇవే
మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి
దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు
దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్ స్టేషన్లు
ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు
13 మంది ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం
రేప్, గ్యాంగ్ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష
చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు
సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష
అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు.
మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్ (ఆన్‌లైన్) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఆధునికీకరణ
తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు
బయాలజీ, సెరాలజీ, సైబర్ ల్యాబ్‌లు
దిశ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు
కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష
రాష్ట్రంలో మహిళా పోలీస్ స్టేషన్ల అప్‌గ్రేడేషన్. ఒక డీఎస్పీ, మూడు ఎస్‌ఐ పోస్టులు మంజూరు
బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ
అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్ సౌకర్యం.