Amaravati, Febuary 10: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (AP government) ఆదాయాన్ని పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా కరెంట్ ఛార్జీలను పెంచుతూ (Electricity Charges Hike) నిర్ణయం తీసుకుంది. 500ల యూనిట్లు పైబడిన వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెరిగాయి. 500ల యూనిట్లు దాటితే యూనిట్ కు 90 పైసలుకి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం (Jagan Govt) నిర్ణయం తీసుకుంది. అంటే 500ల యూనిట్లు పెబడితే.. ప్రతీ యూనిట్ కి రూ.9.05 నుంచి రూ.9.95 కి పెరుగుతాయి. కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయి
ఈ ప్రభావం ఏపీలోని 1.35 లక్షలకు పైగా గృహాల వినియోగదారులకు పెను భారంగా మారనుంది. ముఖ్యంగా ప్రభుత్వ,కార్పొరేట్ సంస్థలపై ఛార్జీలు భారం పడనుంది. పెంచిన విద్యుత్ చార్జీలు రూ.1300 కోట్లు భారం పడుతుంది. దీంతో పాటుగా ఈ ప్రభావం చిన్న మధ్యతరహా పరిశ్రమలపై భారీగా పడుతుంది.
విద్యుత్ కోతలతో ఇన్నాళ్ళు ఇబ్బందులు పడిన చిన్న తరహా పరిశ్రమలు ఇప్పుడే ఆ నష్టాల నుంచి బైటపడుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై మరోసారి పెను భారంగా మారనుంది. రాష్ట్ర ఆదాయం పెంచుకోవడమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
వేటు పడింది, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్
ఇదిలా ఉంటే ఏపీ (Andhra Pradesh) వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్‌కు (Free Electricity) సబ్సిడీ రూపంలో రూ.8,353.58 కోట్లు చెల్లించుటకు ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 18 శాతం ఎక్కువగా సబ్సిడీ ఇవ్వనుంది. సబ్సిడీ పెంచడంతో అదనంగా 18 లక్షల మంది వ్యవసాయదారులకు లబ్ది పొందనున్నారు.
మహిళలకు జీరో వడ్డీ రుణాలు, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్
ఆంద్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ , దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.14,349.07 ఆదాయం అవసరం అవుతుందని అంచనా వేశారు.వినియోగదారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2,893.48 కోట్లు ఆర్టికభారం తగ్గిస్తూ రెండు పంపిణీ సంస్థలు నికర లోటు రూ.10,060.63 కోట్లుగా నిర్దారించారు.
దేశంలో రాజమండ్రిలోనే తొలిసారిగా దిశ పోలీస్ స్టేషన్
500 యూనిట్లలోపు గృహ వినియోగదారులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా ప్రభుత్వం అందివ్వనుంది. ఇందుకోసం 1707.07 కోట్లను సబ్సిడీ రూపంలో విద్యుత్ సంస్థలకు చెల్లించేందుకు ఏపీ సర్కార్ అంగీకారం తెలిపింది.ప్రతి నెలకు ఆనెల లోని విద్యుత్ వినియోగం పైనే వర్గీకరణకు ఆమోదం ఇచ్చింది.
KIA Motors: అన్నీ అబద్దాలే, మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై గత నెలలో ఏపీఎస్పీడీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ) ప్రజాభిప్రాయ సేకరణ తీసుకున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి విద్యుత్ ఛార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.
దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.44,840.86కోట్లు అవసరమవుతాయని ఏఆర్‌ఆర్‌లో డిస్కంలు తెలిపాయి. ఆర్థిక పరిస్థితి అలాగే 2020-21లో సమకూర్చుకోగలిగే రాబడి, నిర్వహణకు అయ్యే వ్యయం, ఏర్పడే లోటుపై డిస్కంలు ఏఆర్‌ఆర్‌లో పొందుపరిచాయి.