Rajahmundry, Febuary 8: పరిపాలనలో దూసుకుపోతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan Mohan Reddy) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడేందుకు మరో అద్భుత అవకాశాన్ని అందించారు. రాష్ట్రంలో మహిళలకు జీరో పర్సెంట్ వడ్డీకి రుణాలు (Zero Percent Interest Loans) అందచేస్తామని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన దిశపోలీసు స్టేషన్ (Disha Police Station) ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ....రాష్ట్రంలో అర్హులైన 25 లక్షల మంది మహిళలకు వచ్చే ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు రిజిష్ట్రేషన్ చేసి ఇవ్వనున్నామని చెప్పారు. నాడు-నేడు (Nadu-Nedu) అనే కార్యక్రమంతో స్కూళ్ల రూపురేఖలు మార్చుతున్నామని.. ఇంగ్లీషు మీడియం స్కూళ్లు (English Medium Schools) ద్వారా పిల్లల జీవితాల్లో మలుపు తీసుకు వస్తున్నామని చెప్పారు.
ప్రతీ అడుగులోనూ అక్కాచెల్లెమ్మలకు అండగా ఉంటా. వారి పిల్లలకు మేనమామలా ఉంటా. 42 మంది లక్షల తల్లులకు అమ్మఒడి అందించాం. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్లపట్టాలు. నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేశాం. సున్నావడ్డీతో మహిళలకు రుణాలు అందిస్తాం. ఈ శతాబ్దపు భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్ నుంచి అవతరించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం’’ అని మహిళా సాధికారికతకై సర్కారు చేపడుతున్న పలు సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ తెలిపారు.
తమ ప్రభుత్వం మహిళలకు తోడుగా ఉంటుందని..వారి కోసం 50 శాతం రిజర్వేషన్లు క్రియేట్ చేసి..నామినేటెడ్ పదవుల్లోనూ..నామినేటెడ్ గా ఇచ్చే పనుల్లోనూ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేలా చట్టం తెచ్చామని ఆయన చెప్పారు. అమ్మ ఒడి పధకం ద్వారా 42 లక్షల మంది తల్లుకు ఫించను అందిస్తున్నామని ..తద్వారా 84 లక్షల మంది పిల్లల చదువుకు ఆర్ధిక సాయం అందుతోందని చెప్పారు.
అన్నీ అబద్దాలే, మేము ఎక్కడికీ తరలిపోవడం లేదు
ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు
దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించిన తరువాత సీఎం జగన్ మాట్లాడారు. ‘‘మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే 7 రోజుల్లోనే దర్యాప్తు, 14 రోజుల్లో విచారణ పూర్తి. ఉరిశిక్ష అమలు చేయడానికి అనువుగా దిశ చట్టం తీసుకవచ్చాం. వ్యవస్థలో మార్పులు రావాలి. అందులో భాగంగానే రాజమండ్రిలో దిశ తొలి మహిళా పోలీసు స్టేషన్‌ను ప్రారంభించాం.
దొనకొండ కేంద్రంగా డిఫెన్స్ క్లస్టర్
మహిళల కోసం ప్రత్యేకంగా 18 దిశ పోలీసు స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. డీఎస్పీ స్థాయి నేతృత్వంలో 47 మంది సిబ్బంది పనిచేస్తారు. 13 జిల్లాల్లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు రూ. 26 కోట్లు కేటాయిస్తున్నాం. హైకోర్టు అనుమతితో త్వరలోనే వీటిని ఏర్పాటు చేస్తాం. విశాఖ, తిరుపతిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల కోసం రూ. 31 కోట్లు విడుదల చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు.