Amaravathi, Febuary 9: ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) సస్పెండ్ చేసింది. ఉద్యోగ నియమావళి, ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో పదవి నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని (Chief Secretary Nilam Sawhney) శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తనా నియమాల ఉల్లంఘనకు సంబంధించి.. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్రమశిక్షణ, అప్పీల్) నిబంధనల నియమం 3 (1) కింద సస్పెండ్ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.
వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న డీజీపీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును (Senior IPS officer A.B.Venkateshwara Rao) ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కారణంగా అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తున్నట్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
ANI Tweet
Andhra Pradesh govt places senior IPS officer under suspension over allegations of indulging in corrupt practices
Read @ANI Story | https://t.co/3YiNfiClAh pic.twitter.com/95MpVREVC1
— ANI Digital (@ani_digital) February 9, 2020
మహిళలకు జీరో వడ్డీ రుణాలు, సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్
ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలటంతో సస్పెండ్ చేసినట్లు జీవో నంబర్ 18లో పేర్కొన్నారు. అలాగే సస్పెన్షన్ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఆయన దేశ భద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను బహిర్గతం చేసినట్లు తేలింది. ఏబీ వెంకటేశ్వరరావు పోలీస్ ఇంటెలిజెన్స్ ప్రొటోకాల్స్ విధానాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇది జాతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పుగా భావిస్తున్నారు. కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఏబీ వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా (Additional DG (CID) ఉండగా రూల్స్‌కు విరుద్దంగా ఇజ్రాయిల్ నుంచి సెక్యూరిటీ పరికరాలు కొనుగోలు చేశారంటూ మొత్తం ఏడు ఆరోపణలపై విచారణ జరిపి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు.
దేశంలో రాజమండ్రిలోనే తొలిసారిగా
ప్రాథమిక ఆధారాలు, నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా ఏబీ వెంకటేశ్వరరావు ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది . 1980 ఐపీఎస్ బ్యాచ్ చెందిన ఏబీ వెంకటేశ్వరరావును గతంలోనే బదిలీ చేసిన ప్రభుత్వం కొన్నాళ్లు పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో పెట్టింది. ఇప్పుడు సస్పెన్షన్ విధిస్తు ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది.
సస్పెన్షన్‌పై స్పందించిన వెంకటేశ్వరరావు
ఈ సస్పెన్షన్‌పై వెంకటేశ్వరరావు స్పందించారు. తన హయాంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తాను ఎలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడ లేదని వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలను వెంకటేశ్వరరావు ఖండించారు. నిబంధనలకు అనుగుణంగానే తాను పని చేశానని చెప్పారు.
ప్రభుత్వం చర్యలతో తనకు వచ్చిన ఇబ్బందేమీ లేదని వెంకటేశ్వరరావు అన్నారు. మిత్రులు, బంధువులు తన సస్పెన్షన్ గురించి ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. సస్పెన్షన్ పై చట్టపరంగా ముందుకెళ్తానని వెంకటేశ్వరరావు చెప్పారు.