Rewa Solar Plant: రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ, భారత్‌లో ఊపందుకున్న సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు

భారత్‌లోనూ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవ‌లం స‌మీప ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్తు అంద‌డ‌మే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని మోదీ తెలిపారు.

PM Narendra Modi and 750 MW Solar Project set up at Madhya Predesh's Rewa. (Photo Credit: ANI)

New Delhi/Bhopal, July 10: జల, థర్మల్ విద్యుత్ కు ప్రత్యామ్నాయంగా ప్రపంచం దృష్టి సౌరశక్తిపై పడింది. భారత్‌లోనూ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని రెవాలో నిర్మించిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టును ప్ర‌ధాని మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. రెవా సౌర విద్యుత్తు ప్రాజెక్టుతో కేవ‌లం స‌మీప ప‌రిశ్ర‌మ‌ల‌కు విద్యుత్తు అంద‌డ‌మే కాకుండా, ఢిల్లీలోని మెట్రో రైలుకు కూడా విద్యుత్తు స‌ర‌ఫ‌రా జ‌రుగుతుంద‌ని మోదీ తెలిపారు. ఒక్కడు 119 మందికి కరోనాని అంటించాడు, దేశంలో 8 లక్షలకు చేరువలో కోవిడ్-19 కేసులు, కరోనా నుంచి కోలుకున్న 96 ఏళ్ల బామ్మ, 21,604కు చేరిన మరణాల సంఖ్య

షాజాపూర్‌, నీముచ్‌, చాతార్‌పూర్ ప్రాంతాల్లోనూ సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు మోదీ చెప్పారు. సౌర విద్యుత్తు నేటి త‌రం కోసం మాత్ర‌మే కాదు అని, 21వ శ‌తాబ్ధ‌పు అవ‌స‌రాల‌ను ఇది తీరుస్తుంద‌న్నారు. సౌర విద్యుత్తు స్వ‌చ్ఛ‌మైంది, భ‌ద్ర‌మైంద‌న్నారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు.