PM Modi Quits Weibo: చైనా ట్విట్టర్‌ను మూసేసిన ప్రధాని మోదీ, వీబోలో పాత పోస్టులను డిలీట్ చేస్తున్న అధికారులు, అకౌంట్ డీయాక్టివేట్ కావడానికి సమయం పట్టే అవకాశం
దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది. చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. అయితే చైనా ట్విట్టర్‌గా పిలిచే వీబోలో ఉండే వీఐపీలు అకౌంట్ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది.
New Delhi, July 2: చెనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధించి కేంద్ర ప్రభుత్వం డిజిటల్ సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టిన∙నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా సామాజిక మాధ్యమమైన వీబోని వీడాలని (PM Modi Quits Weibo) నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియ బుధవారం మొదలైంది. చైనా మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ వీబో (chinese social media website weibo) లో పీఎం మోడీ 2015 నుంచి కొనసాగుతున్నారు. అయితే చైనా ట్విట్టర్‌గా పిలిచే వీబోలో ఉండే వీఐపీలు అకౌంట్ మూసివేయడానికి జరిగే ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం, టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం, రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
అకౌంట్ డీయాక్ట్‌వేట్ చేయడానికి వీబో నుంచి అనుమతుల ప్రక్రియ ఆలస్యం కావచ్చు. కొన్నేళ్ల క్రితం చైనా వీబోలో (WEIBO) చేరిన మోదీకి 2,44,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు ప్రధాని 115 పోస్టులను అందులో ఉంచారు. అకౌంట్ డీయాక్టివేట్ కావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున అందులో ఉన్న పోస్టులను తొలగించే కార్యక్రమం జరుగుతోంది. అయినప్పటికీ మోదీ ఫాలోవర్ల సంఖ్య తగ్గలేదని ప్రధాని కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 113 పోస్టులను డిలీట్ చేశారు. ఇంకా మరో రెండు పోస్టులు మిగిలి ఉండగా.. తాజాగా వాటిని కూడా తొలగించారు. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన
మిగిలిన రెండు పోస్టుల్లో ప్రధాని మోడీ ( PM Modi ), చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ ( Xi Jinping ) తో ఉన్న చిత్రాలు ఉన్నాయి. చైనా అధ్యక్షుడు, ప్రధాని మోడీ ఉన్న పోస్టును తొలగించడం తమకు కష్టమని వీబో యాప్ యాజమాన్యం భారత్‌కి చెందిన సంబంధిత అధికారులకు తెలియజేసింది. దీంతో వీటిని తొలగించడానికి కొంత సమయం పట్టిందని తెలుస్తోంది. కాగా లడఖ్‌లోని గాల్వన్ లోయలో భారత సైనికులపై చైనా దురాఘాతానికి పాల్పడ్డ నాటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనలో 20 మంది భారత సైనికులు అమరులయ్యారు. అప్పటినుంచి దేశంలో చైనా వస్తువులను, చైనా యాప్‌లను బహిష్కరించాలనే డిమాండ్ బలంగా వినిపించింది. అదే సమయంలో దేశ రక్షణకు భంగం కలిగించేలా ఉన్న 59 మొబైల్ యాప్స్‌ని నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది