Tirupati Laddu Dispute: తిరుపతి లడ్డూ వివాదం, పవన్ కల్యాణ్‌కు కౌంటర్ విసిరిన ప్రకాష్ రాజ్, వీడియో ఇదిగో..

ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.

Prakash Raj Counter to Pawan (Photo-X)

తిరుమల లడ్డూ అంశం ఏపీ రాజకీయాలను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ వేలు పెట్టడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం తెలిసిందే.

డిప్యూటీ సీఎంగా ఉన్న మీరు తిరుమల లడ్డూ అంశంపై విచారణ జరిపించవచ్చని... కానీ మీరు ఇష్యూని జాతీయ స్థాయిలో ఎందుకు రచ్చ చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. దేశంలో మతపరమైన సమస్యలు చాలా ఉన్నాయి... కేంద్రంలో ఉన్న మీ మిత్రులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.

ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను, ప్రకాశ్ రాజ్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్, వీడియో ఇదిగో..

ఈ నేపథ్యంలో ఈరోజు మీడియాతో పవన్ మాట్లాడుతూ... అన్నీ తెలుసుకుని ప్రకాశ్ రాజ్ మాట్లాడాలని చెప్పారు. సనాతన ధర్మం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? అని ప్రశ్నించారు. పవన్ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా ఒక వీడియో విడుదల చేశారు.

Here's Video

"శ్రీ పవన్ కల్యాణ్ గారు. నేను ఇప్పుడే మీ ప్రెస్ మీట్ ను చూశాను. నేను చెప్పిందేమిటి? మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేమిటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానాలు చెపుతా. ఈ మధ్యలో మీకు వీలైతే... నా ట్వీట్ ను మళ్లీ చదవండి. అర్థం చేసుకోండి... ప్లీజ్!" అని ప్రకాశ్ రాజ్ అన్నారు.