Vjy, Sep 24: తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను హిందువుల గురించి మాట్లాడితే ప్రకాశ్ రాజ్ కు సంబంధం ఏంటి అని పవన్ ప్రశ్నించారు.
వీడియోలు ఇవిగో, సనాతన ధర్మం కోసం చనిపోవడానికైనా రెడీ, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
నేను హిందూ దేవాలయంలో అపవిత్రత గురించి మాట్లాడాను. ఇందులో ప్రకాశ్ రాజ్ కు (Pawan Kalyan on Prakash Raj) సంబంధం ఏమిటి. నేను వేరొక మతాన్ని నిందిచానా..? ఇస్లాం, క్రిస్టియన్ మతాల గురించి ఏమైనా తప్పుగా మాట్లాడానా? తిరుపతిలో అపవిత్రం జరిగింది.. ఇలా జరగకూడదని చెబితే అది తప్పు ఎలా అవుతుంది. తప్పు జరిగితే మాట్లాడకూడదా..? మాట్లాడితే సెక్యూలరిజంకు విఘాతం అంటే ఏమిటి అంటూ పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
Here's Video
ప్రకాశ్ రాజ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను.. పవన్ కల్యాణ్ సీరియస్ వార్నింగ్ pic.twitter.com/7n8WKHtH6e
— ChotaNews (@ChotaNewsTelugu) September 24, 2024
తిరుపతిలో లడ్డూ వివాదంపై సినీనటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును ప్రస్తావిస్తూ.. మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి. మీరెందుకు అనవసర భయాలు కల్పించి, దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. కేంద్రంలో ఉన్న మీ స్నేహితులకు ధన్యవాదాలు అంటూ ప్రకాశ్ రాజు పోస్టు చేశారు.