Paralympic Games 2024: భారత్ ఖాతాలో మరో స్వర్ణం, పురుషుల హైజంప్ ఈవెంట్లో పసిడి పతకం సాధించిన ప్రవీణ్ కుమార్, 6 గోల్డ్ మెడల్స్‌తో టోక్యో రికార్డును దాటిన భారత్

పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హైజంప్ ఫైనల్లో 2.08 మీటర్లతో ప్రథమస్థానంలో నిలిచాడు.

Praveen Kumar (Photo credit: Paralympic Games YouTube)

ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల హైజంప్ ఈవెంట్లో భారత అథ్లెట్ ప్రవీణ్ కుమార్ పసిడి పతకం సాధించాడు. నోయిడాకు చెందిన 21 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హైజంప్ ఫైనల్లో 2.08 మీటర్లతో ప్రథమస్థానంలో నిలిచాడు.

ఈ స్వర్ణంతో పారా ఒలింపిక్స్ లో భారత్ ఖాతాలో పసిడి పతకాల సంఖ్య 6కి పెరిగింది. ఇప్పటిదాకా భారత్ పారిస్ పారా ఒలింపిక్స్ పోటీల్లో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాల సహా మొత్తం 26 పతకాలు కైవసం చేసుకుంది. ప్రవీణ్ కుమార్ ఘనతతో... భారత్ పారా ఒలింపిక్స్ లో తన అత్యధిక స్వర్ణాల రికార్డును అధిగమించింది. గత టోక్యో పారా ఒలింపిక్ క్రీడల్లో భారత్ 5 పసిడి పతకాలు చేజిక్కించుకుంది.

భారత్ ఖాతాలో మరో పసిడి పతకం,ఆర్చరీ విభాగంలో బంగారు పతకం సాధించిన తొలి క్రీడాకారుడిగా హర్విందర్ సింగ్ రికార్డ్, 24కి చేరిన భారత్ పతకాల సంఖ్య

ఇప్పుడు పారిస్ లో 6 గోల్డ్ మెడల్స్ తో ఆ రికార్డును సవరించింది. భారత్ కు రికార్డు స్వర్ణం అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. తన సంకల్పం, దృఢదీక్షతో మన దేశానికి కీర్తి సాధించిపెట్టాడని కొనియాడారు. ప్రవీణ్ కుమార్ ఘనతను చూసి దేశం గర్విస్తోందని మోదీ ట్వీట్ చేశారు.



సంబంధిత వార్తలు

Bank Holidays in 2025: బ్యాంక్ సెలవుల జాబితా 2025 ఇదిగో, పండుగల నుండి జాతీయ సెలవులు వరకు బ్యాంక్ సెలవుల పూర్తి జాబితాను తెలుసుకోండి

Tech Layoffs 2024: ఈ ఏడాది భారీగా టెక్ లేఆప్స్, 1,50,034 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపిన 539 కంపెనీలు, ఏఐ టెక్నాలజీ రావడంతో రోడ్డున పడుతున్న ఉద్యోగులు

Sandhya Theatre Tragedy: రేవతి కుటుంబానికి రూ. 2 కోట్ల ఆర్థిక సాయం అందజేసిన అల్లు అరవింద్, బాబు త్వరగా కోలుకుని మన అందరితో తిరుగుతాడని ఆశిస్తున్నామని వెల్లడి

Happy New Year 2025: కొత్త సంవత్సరం మీ ఫ్యామిలీతో కలిసి దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే హైదరాబాద్ లో ఉన్న టాప్ 5 దేవాలయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.