Anti-CAA Protests: ఢిల్లీలో హింసాత్మకంగా ‘సీఏఏ’ ఘర్షణలు, రాళ్ల దాడి చేసుకున్న సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాలు, ఉద్రిక్తతల నేపథ్యంలో మౌజ్‌పూర్ మెట్రోస్టేషన్ మూసివేత

ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు (Anti-CAA Protests) జరుగుతున్న జఫ్రాబాద్ (Jaffrabad) ఏరియాకు సమీపంలోనే మౌజ్‌పూర్ ఉంది.

Clashes in Maujpur | (Photo Credits: ANI)

New Delhi, February 23: దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టం(CAA) వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్‌పూర్‌లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనలు (Anti-CAA Protests) జరుగుతున్న జఫ్రాబాద్ (Jaffrabad) ఏరియాకు సమీపంలోనే మౌజ్‌పూర్ ఉంది.

చంపుకోవడం, కొట్టుకోవడం భారతదేశ చరిత్ర కాదు

సీఏఏకు మద్దతుగా స్థానిక బీజేపీ నాయకుడు నేతృత్వంలో ఓ వర్గం మౌజ్‌పూర్‌లో ర్యాలీ తీయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరిపై మరొకరు రాళ్లురువ్వుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. అనంతరం ప్రదర్శకులపై లాఠీచార్జి జరిపారు.

సీఏఏపై ప్రతిపక్షాలకు సవాల్ విసిరిన అమిత్ షా

ఇరువర్గాల మధ్య ఎడతెరిపి లేకుండా రాళ్లు రువ్వుడు ఘటనలు చోటుచేసుకోవడంతో హుటాహుటిన ఆ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మౌజ్‌పూర్ మెట్రోస్టేషన్ మూసేశారు. రాళ్లు రువ్వుడు ఘటనలో పలువురికి గాయాలైనట్టు సమాచారం.

Update by ANI

సిఎఎ అనుకూల ర్యాలీకి భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుడు కపిల్ మిశ్రా నాయకత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. ఇరువర్గాలు ఎదురెదురుగా వచ్చిన తరువాత, వారి మధ్య ఘర్షణలు చెలరేగాయి. దీంతో ఇరువైపులా దుండగులు రాళ్ళు రువ్వడం ప్రారంభించారని పోలీసు అధికారి చెప్పారు. ఈ దాడిలో కొద్ది మందికి స్వల్ప గాయాలైనట్లు తెలిసింది.