Pune Shocker: కండోమ్ తీసుకురాలేదని బాలుడిపై కత్తితో దాడి, మహారాష్ట్ర పూణేలో దారుణ ఘటన, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధిత బాలుడి కుటుంబం, యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు

బాలుడిపై ఒక యువకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కండోమ్‌ తీసుకురావాలని ఆ బాలుడిని ఒత్తిడికి గురిచేశాడు. ఆ బాలుడు నిరాకరించడంతో కత్తితో దాడి (Pune-based man stabs minor) చేశాడు. ఈ షాకింగ్ ఘటన పూణేలోని చాంద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

Image used for representational purpose only. | (Photo Credits: Pixabay)

Pune, August 7: మహారాష్ట్రలోని పూణేలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బాలుడిపై ఒక యువకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కండోమ్‌ తీసుకురావాలని ఆ బాలుడిని ఒత్తిడికి గురిచేశాడు. ఆ బాలుడు నిరాకరించడంతో కత్తితో దాడి (Pune-based man stabs minor) చేశాడు. ఈ షాకింగ్ ఘటన పూణేలోని చాంద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

ZEE News కథనం ప్రకారం... పూణేలోని మైనర్ తుకారాంనగర్ కు చెందిన నీలేశ్‌ (21) అదే ప్రాంతానికి చెందిన ఓ బాలుడు దగ్గరకు వెళ్లి దగ్గరలోని ఓ ఫార్మసి స్టోర్‌కి వెళ్లి కండోమ్‌ ప్యాకెట్‌ తీసుకురమ్మని బెదరించాడు. దీనికి ఆ బాలుడు నిరాకరించడంతో (he refuses to get condom) దూషిస్తూ.. అతనిని కొట్టడం మొదలెట్టాడు. అంతేకాదు.. కత్తితో మెడపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన బాలుడిని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

నేను బిడ్డను కనాలి, నా భర్తకు బెయిల్ ఇవ్వండి, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ముందుకు వింత పిటిషన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహా కోరిన హైకోర్టు

ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షి తెలిపిన ఆధారాల ప్రకారం.. సమీపంలో ఉన్న కారు నుంచి కత్తి తీసి దాడి చేశారని పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి కుటుంబసభ్యులు పుణెలోని చందానగర్‌ ఠాణాలో సెక్షన్ 307 తో సహా వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు నమోదు చేశారు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.