'Right to Procreate': నేను బిడ్డను కనాలి, నా భర్తకు బెయిల్ ఇవ్వండి, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ముందుకు వింత పిటిషన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహా కోరిన హైకోర్టు

నాకు పెళ్లయి మూడు నెలలు అయింది. ఎటువంటి కార్యం జరగలేదు.. ఇప్పుడు నేనే బిడ్డను కనాలనుకుంటున్నాను. నా భర్తకు తాత్కాలిక బెయిల్ ఇప్పించండి అంటూ ఓ మహిళ ఉత్తరాఖండ్ హైకోర్టు (Uttarakhand HC ) తలుపుతట్టింది.

'Right to Procreate': నేను బిడ్డను కనాలి, నా భర్తకు బెయిల్ ఇవ్వండి, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ముందుకు వింత పిటిషన్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహా కోరిన హైకోర్టు
Court Judgment, representational image | File Photo

Nainital, August7: నాకు పెళ్లయి మూడు నెలలు అయింది. ఎటువంటి కార్యం జరగలేదు.. ఇప్పుడు నేనే బిడ్డను కనాలనుకుంటున్నాను. నా భర్తకు తాత్కాలిక బెయిల్ ఇప్పించండి అంటూ ఓ మహిళ ఉత్తరాఖండ్ హైకోర్టు (Uttarakhand HC ) తలుపుతట్టింది. ఆమె భర్త అత్యాచార ఆరోపణల కింద అరెస్ట్ అయి జైలులో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ వింత పిటిషన్ ఉత్తరాఖండ్‌ హైకోర్టు ముందుకు వచ్చింది.

పిటిషన్ వివరాల్లోకెళితే.. ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటికి అతడు జైలుకెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది. అయితే పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని.. తమకు కలిసే అవకాశం లభించలేదని నిందితుని భార్య కోర్టుకు తెలిపింది. మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. కనుక నా భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వండింటూ సచిన్‌ భార్య హైకోర్టును ఆశ్రయించిది. ఇది భార్యగా తన హక్కు అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది.

త్వరలో మరో వ్యాక్సిన్ కోర్బివాక్స్‌ అందుబాటులోకి, టీకా తయారీకి ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ మాండవియా, దేశంలో తాజాగా 38,628 కరోనా కేసులు

ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి ఆర్‌ఎస్‌ చౌహాన్‌, జస్టిస్‌ అలోక్‌ కుమార్‌ వర్మల (Chief Justice R S Chauhan, Alok Kumar Verma) ధర్మాసనం ఈ పిటిషన్‌ని విచారించింది. ఎప్పుడూ ఇలాంటి కేసు రాకపోవడంతో వారు ఈ పిటిషన్ మీద పలు సందేహాలను వ్యక్త పరుస్తూ.. సలహా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

కోర్టు వ్యక్తం చేసిన అనుమాలు: ‘‘అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా?.. ఈమె ‘భార్యగా నా హక్కు’ (Right to Procreate)అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి ‘బిడ్డలుగా మా హక్కు’ అనే అవకాశం ఉంది కదా’’.. అని హైకోర్టు అభిప్రాయపడింది. పైగా తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా అని కూడా ధర్మాసనం ఆలోచిస్తోందన్నారు.అలాగే తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కోర్టు అభిప్రాయపడింది.

ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులేమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయా.. ఒకవేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయి.. అన్న వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలపాలని హైకోర్టు కోరింది.

(The above story first appeared on LatestLY on Aug 07, 2021 01:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).