Mohali Building Collapse: పంజాబ్‌లో ఘోర ప్రమాదం, కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఏడుగురిని కాపాడిన సహాయక బృందం, కొనసాగుతున్న సహాయక చర్యలు

మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది.భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. శిథిలాల చిక్కుకున్న ఇద్దరిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది రక్షించారు.

Mohali building collapse. (Photo Credit: ANI)

Chandigarh, February 8: పంజాబ్‌లో (Punjab) ఘోర ప్రమాదం సంభవించింది. మొహాలీలో ఓ మూడంతస్తుల భవనం (Building Collapse) కుప్పకూలింది.భవనం శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందితో కలిసి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. శిథిలాల చిక్కుకున్న ఇద్దరిని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ (NDRF) సిబ్బంది రక్షించారు.

ఎవరూ మృతిచెందినట్లుగా ఇంతవరకు అధికారిక సమాచారమేది రాలేదు. ప్రక్కనే ఉన్న భూమిని చదును చేసే క్రమంలో జేసిబీ ఈ భవనం గోడలను తాకడంతో భవనం కూలినట్లుగా అధికారులు పేర్కొన్నారు.వారిని రక్షించే పనులు కొనసాగుతున్నాయి.

ముషీరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో కాలిబూడిదైన 7 కార్లు

కాగా మూడంతస్తుల భవనం పక్కన జేసీబీతో పునాది కోసం తవ్వకాలు చేపట్టిన సమయంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. విపత్తు నివారణ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టాయి. మూడు అంతస్థుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పలువురికి గాయాలు అయ్యాయి.

Here's the ANI tweet:

సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటి వరకు ఏడుగురిని కాపాడినట్టు సహాయక బృందాల సభ్యులు తెలిపాయి. ప్రమాద స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Here's the ANI tweet:

తాజా సమాచారం ప్రకారం, వార్తా సంస్థ ANI చెప్పినట్లుగా, లాండ్రా రోడ్‌లో మధ్యాహ్నం మూడు అంతస్థుల భవనం కూలిపోయింది. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని నివేదించబడినప్పటికీ, రెస్క్యూ మిషన్ కోసం అత్యవసర సేవలను తీసుకువచ్చారు. 10 మంది కంటే ఎక్కువ మంది శిధిలాల లోపల చిక్కుకున్నారని తెలిపింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.