PV Sindhu Marriage: ఈ నెల 22న పీవీ సింధు వివాహం.. వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో పెండ్లి.. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌ లో వివాహం .. హైదరాబాద్‌ లో 24న రిసెప్షన్

వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు త్వరలోనే పెండ్లి పీటలు ఎక్కనున్నారు.

PV Sindhu Marriage (Credits: X)

Hyderabad, Dec 3: భారత స్టార్ షట్టర్ పీవీ సింధు వివాహానికి (PV Sindhu Marriage) మూహూర్తం ఖరారైంది. వరుసగా రెండు ఒలింపిక్స్ మెడల్స్ సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సాధించిన సింధు త్వరలోనే పెండ్లి (Marriage) పీటలు ఎక్కనున్నారు.  హైదరాబాద్ వ్యాపారవేత్త వెంకటదత్త సాయితో సింధు పెళ్లి ఖాయమైందని ఆమె తండ్రి పీవీ రమణ వివరాలు వెల్లడించారు. రాజస్థాన్‌ లోని ఉదయ్‌ పూర్‌లో ఈ నెల 22న పెళ్లి జరగనుందని ఆయన తెలిపారు. ఈ నెల 24న హైదరాబాద్‌ లో రిసెప్షన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

'పుష్ప‌2' టీమ్ కు గుడ్ న్యూస్.. ఏపీలోనూ టికెట్ ధ‌ర‌ల పెంపున‌కు ప్రభుత్వం ఉత్త‌ర్వులు.. బెనిఫిట్ షోలు కూడా.. సీఎం, డిప్యూటీ సీఎంల‌కు అల్లు అర్జున్‌ కృత‌జ్ఞ‌త‌లు.. పెరిగిన టికెట్ రేట్లు ఎంతంటే??

గతనెలలోనే నిర్ణయం

సాయి కుటుంబం తమకు చాలా కాలంగా తెలుసునని, గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించి నిర్ణయం తీసుకున్నామని రమణ  చెప్పారు. వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ గా వ్యవహరిస్తున్నారు.

వీడియో ఇదిగో, ముంబై మెట్రో ట్రైన్లపై పుష్ప-2 మూవీ పోస్టర్లు, ముంబైలో ఓ తెలుగు సినిమాకు ఇలా ప్రమోషన్ చేయడం ఇదే తొలిసారి