Rahul Gandhi vs PM Modi: మోదీ అబద్దాలు ఎందుకు చెబుతున్నారు, చైనా-భారత్ సరిహద్దు వివాదంపై ప్రధానిపై మండిపడిన రాహుల్ గాంధీ
మే నెలలో తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చైనా ఆర్మీ (Chinese Army) ప్రవేశించినట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జూన్ 15వ తేదీ గల్వాన్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కంటే నెల రోజుల ముందే చైనా ఆర్మీ భారత్‌లో ప్రవేశించిందని అబద్దాలు ఎందుకు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు.
New Delhi, August 6: చైనా-భారత్ సరిహద్దుల్లో ఇటీవల నెలకొన్న పరిస్థితుల గురించి (India-China Tensions) ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi vs PM Modi) మరోసారి మండిపడ్డారు. మే నెలలో తూర్పు లడఖ్ ప్రాంతంలోకి చైనా ఆర్మీ (Chinese Army) ప్రవేశించినట్లు తెలుపుతూ వచ్చిన ఓ వార్తను రాహుల్ గాంధీ తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. జూన్ 15వ తేదీ గల్వాన్ లోయ వద్ద చైనా-భారత్ సైనికుల మధ్య జరిగిన ఘర్షణ కంటే నెల రోజుల ముందే చైనా ఆర్మీ భారత్‌లో ప్రవేశించిందని అబద్దాలు ఎందుకు చెబుతున్నారని రాహుల్ మండిపడ్డారు.
లద్దాఖ్ వద్ద భారత భూభాగాన్ని చైనా దళాలు మేలోనే ఆక్రమించాయని రక్షణ శాఖ ఒక రిపోర్టులో పేర్కొంది. ఈ విషయాన్ని ఒక జాతీయ మీడియా తన పత్రికలో ప్రచురించింది. అయితే వాస్తవాధీన రేఖ వద్ద భూభాగాన్ని చైనా బలగాలు ఆక్రమించాయని భారత రక్షణశాఖ మాత్రం ఆ నిజాన్ని దాచి పెట్టిందని రాహుల్ చెప్పారు.
Here's Rahul Tweet
కూగ్రంగ్ నాలా, గోగ్రా, పాన్‌గంగ్ సో ప్రాంతాల్లోకి మే నెల 17, 18వ తేదీల్లో చైనా ఆర్మీ వచ్చినట్లు రక్షణ శాఖ తెలిపిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ ఎందుకు అసత్యాలు చెబుతున్నారని రాహుల్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. జూన్ 15న గల్వాన్ లోయలో చైనా- భారత్ మధ్య జరిగిన ఘర్షణలలో 20 మందికి పైగా భారత్ సైనికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. చైనా మళ్లీ బరి తెగించింది, 40,000 మంది సైనికులని సరిహద్దుల్లో మోహరించింది
తూర్పు లడఖ్‌లో దళాల ఉపసంహరణపై భారత్, చైనా దళాల కమాండర్లు చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పాంగాంగ్ సరస్సు వెంబడి వెనుకకు వెళ్ళేది లేదని భారత సైన్యం స్పష్టంగా చెప్పింది. దళాల ఉపసంహరణకు దోహదపడేవిధంగా ఓ కీలకమైన స్థావరాన్ని ఖాళీ చేయాలని భారత సైన్యాన్ని చైనా సైన్యం డిమాండ్ చేసింది. దీనిని భారత సైన్యం తోసిపుచ్చింది.