New Delhi, July 23: సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పాలంటూ చైనా ఓ పక్క చెబుతూనే మరోపక్క తన జిత్తులమారితనాన్ని బయటపెట్టుకుంటూ వస్తోంది. సరిహద్దుల నుంచి రెండు కిలోమీటర్ల దూరం చైనా బలగాలు వెనక్కి వెళ్లాయనే వార్తలు ఈ మధ్య వినిపించగా..అవి ఒట్టి పుకారులేనని తేలిపోయింది. తాజాగా అందిన సమాచారం ప్రకారం తూర్పు లఢక్‌లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి దాదాపు 40 వేల సైనిక దళాలను (40,000 Chinese Troops on Ladakh Front) మోహరించింది. చైనాపై నిప్పులు చెరిగిన అమెరికా, హౌస్టన్ చైనా రాయబార కార్యాలయం మూసివేత, కోవిడ్-19 వ్యాక్సిన్ అధ్యయన పత్రాలు చైనా హ్యాక్ చేసిందని ఆరోపణలు
ఈ మొహరింపు ద్వారా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను (India-China Border Tensions) తగ్గించేందుకు కృషి చేస్తామని చెబుతూనే, మరోవైపు తద్వారా ఇటీవల జరిగిన సైనిక, దౌత్యపరమైన చర్చల్లో చేసిన వాగ్దానాలకు తూట్లు పొడిచింది. గతవారం జరిగిన ఆఖరి దఫా చర్చల తర్వాత కూడా సరిహద్దుల్లో సైనాన్ని ఉపసంహరించే చర్యలకు ఆ దేశం (China) సిద్ధపడలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. పెట్రోల్ పాయింట్ 17ఏ వంటి ప్రాంతాల్లో ఇరువైపులా కేవలం 600 - 800 మీటర్ల దూరంలోనే ఇరుదేశాల సైనికులు ఉన్నట్టు వివరించాయి. చైనా బలగాల మోహరింపు నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సైన్యానికి అవసరమైన సామగ్రి, రక్షణ వ్యవస్థలను సమకూరుస్తున్నది. మేకుల రాడ్‌లతో చైనా దాడి, 76 మంది జవాన్లకు గాయాలు, అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపిన ఇండియన్ ఆర్మీ, 15 రోజుల్లో డ్యూటీలో చేరుతారని ప్రకటన
తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో (Eastern Ladakh sector)వాయుసేన యుద్ధ విమానాల మోహరింపు ఇలాంటిదేనని మంత్రి పేర్కొన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (Home Ministry) ఓ ప్రకటన విడుదల చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వివరించిన మంత్రి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా వాయుసేన సిద్ధంగా ఉండాలని కోరారు. శత్రువులను ఎదుర్కొనేందుకు వాయుసేన సన్నద్ధంగా ఉంటుందని సదస్సులో ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బధూరియా స్పష్టం చేశారు. చైనా భయపడిందా? రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన చైనా బలగాలు, చైనా విదేశాంగ మంత్రితో అజిత్ ధోవల్ చర్చలు
ఎలాంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కోవడానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని వైమానిక దళానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ‘ఎయిర్‌ఫోర్స్ కమాండర్స్ కాన్ఫరెన్స్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇటీవల సరిహద్దు వెంట తూర్పు లఢక్‌లో ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు వాయుసేన సమర్థంగా పనిచేసిందని, వేగంగా యుద్ధ విమానాలను మోహరించిందని చెప్పారు. గతంలో జరిగిన బాలాకోట్ మెరుపుదాడులుగానీ, ఇప్పడు చైనాతో సరిహద్దు వివాదం విషయంలోగానీ వాయుసేన వృత్తి నిబద్ధతను ప్రదర్శించి సమర్థవంతంగా పనిచేసిందని కొనియాడారు. ఎలాంటి సవాళ్లనైనా దీటుగా ఎదుర్కోగలమన్న గట్టి సందేశాన్ని శత్రు దేశాలకు ఐఏఎఫ్ పంపిందని మెచ్చుకున్నారు.
కాగా బలగాల మళ్లింపుపై ఇరు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని చైనా పీపుల్స్ రిబరేషన్ ఆర్మీ లెక్కచేయడం లేదు. భారత్–చైనా కమాండర్ల స్థాయి చర్చలు గత వారంలోనే జరిగాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరు దేశాల అధికారులు నిర్ణయించుకున్నారు. అయినా చైనా తన పంథా మార్చుకోవడం లేదు.
ఇదిలా ఉంటే తూర్పు లఢక్‌లో ఉద్రిక్తతలకు తెరతీసిన చైనా.. భారత్ తదితర హిమాలయ దేశాలను బెదిరించజాలదని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. మరోవైపు, ఉద్రిక్తతలను శాంతియుతంగా తగ్గించేందుకు చైనా కృషి చేయాలని పేర్కొంటూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అమెరికాలోని ప్రతినిధుల సభ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది.