Rail Bhawan to Remain Closed: మళ్లీ మూతపడిన రైల్ భవన్, ఉద్యోగినికి కోవిడ్‌-19 పాజిటివ్, గత రెండు వారాలుగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగులోకి

సెంట్రల్‌ ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో (Rail Bhawan) పనిచేసే ఓ ఉద్యోగినికి సోమవారం కోవిడ్‌-19 పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఇదే భవనంలో గత రెండు వారాలుగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇక మే 20న చివరిసారిగా ఆమె విధులకు హాజరైనట్టు సమాచారం. ఆమెతో కలిసి కార్యాలయ విధుల్లో పనిచేసిన 14 మంది అధికారులను హోం క్వారంటైన్‌కు పంపారు.

Coronavirus Outbreak. | (Photo Credits: Pixabay)

New Delhi, May 25: దేశ రాజధానిలో కోవిడ్-19 (COVID 19) వేగంగా విస్తరిస్తోంది. సెంట్రల్‌ ఢిల్లీలోని రైల్‌ భవన్‌లో (Rail Bhawan) పనిచేసే ఓ ఉద్యోగినికి సోమవారం కోవిడ్‌-19 పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఇదే భవనంలో గత రెండు వారాలుగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూశాయి. ఇక మే 20న చివరిసారిగా ఆమె విధులకు హాజరైనట్టు సమాచారం. ఆమెతో కలిసి కార్యాలయ విధుల్లో పనిచేసిన 14 మంది అధికారులను హోం క్వారంటైన్‌కు పంపారు.  సరిహద్దుల్లో అనుమానాస్పదంగా గూఢాచారి పావురం, పాకిస్థాన్‌ గూఢచార కపోతంగా నిర్థారించిన కథువా జిల్లా ఎస్పీ శైలేంద్రమిశ్రా, ఆర్మీ అధికారులకు అప్పగింత

గతంలో రైల్‌ భవన్‌లో పాజిటివ్‌ కేసులు నమోదవడంతో భవనంలో శానిటైజేషన్‌ చేపట్టేందుకు ఈనెల 14, 15 తేదీల్లో రైల్‌ భవన్‌ను (Rail Bhawan Closed) మూసివేశారు. ఇప్పుడు మళ్లీ అది క్లోజ్ అయింది. ఈ నెల 26, 27 తేదీల్లో క్లోజ్ చేస్తున్నట్లు (Rail Bhawan to Remain Closed) అధికారులు ప్రకటించారు.శానిటైజ్ చేసిన తరువాత ఓపెన్ చేస్తామని తెలిపారు. మిడతల దాడిపై అధికారులు అలర్ట్, వాటిని చంపేందుకు రంగం సిద్ధం, ఇవి పొలంపై వాలాయంటే అంతే సంగతులు

దేశరాజధాని ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. దీంతో మొత్తం ఢిల్లీలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 14,053కు చేరింది. వీటిలో 7,006 యాక్టివ్ కేసులుకాగా, 6,711మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది. అలాగే కొత్తగా 15 కరోనా మరణాలు సంభవించడంతో ఢిల్లీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 276కు చేరింది. పది రాష్ట్రాలే కొంప ముంచాయి, 90 శాతం కేసులు ఆ రాష్ట్రాల్లోనే, దేశంలో లక్షా 38 వేలు దాటిన కోవిడ్ 19 కేసులు, 4,021 మంది మృతి

తమిళనాడులో ప్రతి రోజూ దాదాపు వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ రోజు కూడా 800కు పైగా కరోనా బాధితులను ప్రభుత్వం తాజాగా గుర్తించింది. ఈ మేరకు నేడు నమోదైన కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం గత 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 805 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మరణించారు. 407 మంది ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలోని మొత్తం కేసులు 17,082కు చేరాయి. 118 మంది మృత్యువాత పడ్డారు. 8,731 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 8,233 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.