Raipur Road Accident: వలస కూలీలు మృత్యువాత, రాయ్‌పూర్‌లో బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడు మంది మృతి, మరో ఏడుగురుకి తీవ్ర గాయాలు, రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Raipur, September 5: చత్తీస్‌ఘడ్ లోని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Raipur Road Accident) చోటు చేసుకుంది. వలస కూలీలతో వెళుతున్న బస్సు, ట్రక్కును ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృత్యువాతపడగా, మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున ఛత్తీష్‌ఘడ్, రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఓ బస్సు వలసకూలీలను ఒరిస్సా, గంజాంనుంచి గుజరాత్‌లోని సూరత్‌కు ( From Odisha to Gujarat) తరలిస్తోంది.
శనివారం తెల్లవారుజామున రాయ్‌పూర్‌లోని చెరి ఖేడి వద్దకు రాగానే ఓ ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సు నుజ్జునుజ్జయి అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే (7 Dead After Bus Carrying Labourers) మరణించారు. మరో ఏడుగురు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రదేశానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయాలపాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వరంగల్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం
రాయపూర్ ఎస్ఎస్పీ అజయ్ యాదవ్ మాట్లాడుతూ.. లాక్‌డౌన్‌కు ముందు వీరంతా సూరత్‌లో పనిచేశారని, కరోనా నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లారని చెప్పారు. మళ్లీ ఉపాధి కోసం సూరత్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించామని, అక్కడ వారు చికిత్స పొందుతున్నారని తెలిపారు. మృతులను ఇంకా గుర్తించాల్సివుందన్నారు. ప్రస్తుతం పోలీసులు సంఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
ఈ ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగ్రాతులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.