Road accident at Naguluppalapadu in Prakasam 9-daily-labours-has-dead-in-andhra-pradesh (Picture Credits: ANI)

Warangal, Sep 2: తెలంగాణలో వరంగల్‌ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ దగ్గర బుధవారం తెల్ల‌వారుజామున‌ 3 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Warangal Road Accident) సంభవించింది. కారును ఇసుక లారీ బ‌లంగా ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్పాట్‌లోనే చనిపోయారు. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేస్తూ (lorry crashes a car) లారీ డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకున్నాడు. ఇంతలో ఒక్క‌సారిగా భారీ శబ్దం వచ్చింది. డ్రైవర్ తేరుకునేస‌రికే..అంతా అయిపోయింది. కారు నుజ్జునుజ్జైంది.

పరకాల ఏసీపీ శ్రీనివాస్‌ ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలను ప‌ర్య‌వేక్షించారు. చనిపోయిన వారు కారులోనే ఇరుక్కుపోయారంటే ప్ర‌మాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మృతదేహాల్ని అతి కష్టం మీద కారు నుంచి బయటకు తీసి… పోస్ట్‌మార్టం కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

మ‌ర‌ణించిన వారంతా వరంగల్‌ జిల్లాలోని పోచం మైదాన్‌కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారిని మేకల రాకేశ్‌, చందు, రోహిత్‌, పవన్, సాబీర్‌‌గా‌ గుర్తించారు. వరంగల్‌ నుంచి పరకాలకు కారులో వెళ్తుండగా ప్రమాదం జ‌రిగింది. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.వీరి వయసు దాదాపు పాతిక సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కారును ఢీకొట్టిన లారీ, నలుగురు అక్కడికక్కడే మృతి, బెంగళూరు నుంచి నెల్లూరుకు వస్తుండగా బంగారుపాళెం వద్ద విషాద ఘటన

ఇదిలా ఉంటే నిన్ననే వరంగల్ జిల్లాలో ఆ ఏరియా దరిదాపుల్లోనే జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని (Couple killed in Warangal accident) బలి తీసుకుంది. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందగా.. చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన వరంగల్‌ జిల్లా దామెర మండల పరిధిలో జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న సంఘటనలో దంపతులు మృత్యువాతపడ్డారు.

మృతిచెందిన వారు మలుగు జిల్లా యాపలగడ్డకు చెందిన తాడెం శ్రీనివాస్‌ (40), మమత (35)గా గుర్తించారు. దంపతులు తమ చిన్నారితో కలిసి వరంగల్‌కు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో దామెర మండల పరిధిలో ఎదురెదురుగా వచ్చిన మరో బైక్ వీరి బైక్‌ను ఢీకొట్టిది. ఈ ఘటనలో అక్కడికక్కడే దంపతులు మృతి చెందగా, చిన్నారి గాయపడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారి రోదిస్తున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది.