Rajasthan Shocker: మళ్ళీ నిర్భయ ఘటన, ప్రైవేట్ భాగాల్లో పదునైన వస్తువులు చొప్పించి బాలికపై దారుణంగా అత్యాచారం, ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న దివ్యాంగురాలు
అల్వార్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం (Minor Girl Raped) చేయడంతోపాటు కామాంధులు ఆమె ప్రైవేటు భాగంలో పదునైన వస్తువులను చొప్పించారు.
Alwar, Jan 13: రాజస్థాన్ రాష్ట్రంలో ఢిల్లీ లాంటి మరో నిర్భయ ఘటన చోటు చేసుకుంది. అల్వార్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం (Minor Girl Raped) చేయడంతోపాటు కామాంధులు ఆమె ప్రైవేటు భాగంలో పదునైన వస్తువులను చొప్పించారు. అల్వారా పట్టణంలోని తిజారా ఫ్లైఓవర్ కింద గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ దివ్యాంగ బాలిక అపస్మారక స్థితిలో (Dumped Near A Flyover In Alwar) పడినట్లు పోలీసులకి సమాచారం అందింది. వెంటనే బాలికను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించగా ఆమెపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వార్ ప్రాంతంలోని తిజారా ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ పై అపస్మారక స్థితిలో ఉన్న దివ్యాంగ బాలికను కొందరు గుర్తించి పోలీసులకి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడి ఉన్న బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను జైపూర్ నగరంలోని జేకే లోన్ ఆసుపత్రికి తరలించారు. బాధిత బాలికకు రక్త స్రావం ఆగకపోవడంతో వైద్యులు రెండున్నర గంటలపాటు ఆపరేషన్ చేశారు.
బాలిక ప్రైవేటు పార్టులో పదునైన వస్తువులను చొప్పించడంతో (sharp objects inserted into her private parts) ఆమె అంతర్గత అవయవాలకు తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. బాలికను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచి చికిత్స చేస్తున్నామని డాక్టర్ అరవింద్ శుక్లా చెప్పారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు. 25 కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేసిన 300కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించామని, అయితే ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు చెప్పారు.
నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాజస్థాన్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మమతా భూపేష్ హామీ ఇచ్చారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అల్వార్ ఘటనపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ నుండి నివేదికను కోరారని సమగ్ర దర్యాప్తు కోసం (investigation underway) కోరినట్లు అధికారిక వర్గాలు పిటిఐకి తెలిపాయి.
Here's ANI Tweet
రాజస్థాన్ మంత్రి మమతా భూపేష్ బాలిక కుటుంబానికి రూ.6 లక్షల పరిహారం ప్రకటించారు. రూ.6 లక్షలలో రూ.5 లక్షలు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రూ. లక్షను మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అందించింది.అల్వార్‌లోని బాధిత కుటుంబ సభ్యులకు సామాజిక న్యాయ శాఖ మంత్రి టికారమ్ జూలీ రూ. 3.5 లక్షల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. కాగా బాధితురాలి తల్లిదండ్రులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుండగా ఆమెకు సోదరుడు, సోదరి ఉన్నారు.
Here's Vasundhara Raje Tweet
రాజస్థాన్‌లో మహిళల భద్రతపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే సింధియా తీవ్ర ప్రశ్నలు సంధించారు. మహిళలపై జరిగే నేరాల్లో రాజస్థాన్ నంబర్ వన్‌గా నిలిచింది. దీన్ని సహించలేం. మహిళల రక్షణకు, దోపిడీ నుంచి వారిని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.