Kottayam, Jan 10: కేరళలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. లైంగిక కోర్కెలను తీర్చుకునేందుకు జీవిత భాగస్వాములను మార్చుకుంటున్న సెక్స్ రాకెట్ ('Partner Swapping' Racket)బట్టబయలైంది. ఈ ఘటనలో కేరళ పోలీసులు ఏడుమందిని అరెస్ట్ చేశారు. ఈ రాకెట్లో దాదాపు 100 మంది జంటలు పాల్గొనట్లు తెలుస్తోంది. మరో వ్యక్తితో లైంగిక సంబంధం పెట్టుకోవాలని తన భర్త ఒత్తిడి చేస్తున్నాడని బాధిత మహిళ కరుచుకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ రాకెట్ (Wife-swap racket busted in Kottayam) వెలుగులోకి వచ్చింది. కాగా గతంలో కయంకులం ప్రాంతంలో ఇలాంటి ఘటనలు అనేకం వెలుగు చూశాయి.
ఘటన బయటపడిందిలా.. కేరళలోని కరుచాకల్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను లైంగికంగా వేధించేవాడు. అంతటితో ఆగకుండా అసహజ రీతిలో శృంగారం చేయాలని బలవంతం చేసేవాడు. ఈ రీతిలో ప్రతిరోజు భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెపై పశువాంఛను తీర్చుకునేవాడు. కొంత కాలానికి ఆ వ్యక్తి ఆగడాడు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతను మరికొందరితో కలిసి ఒక గ్యాంగ్ మాదిరిగా ఏర్పడ్డాడు. ఈ గ్యాంగ్‌లో ఏడుగురు సభ్యులున్నారు.
ఈ ఏడుగురితో కూడా.. తన భార్యను లైంగిక చర్యకు సహకరించాలని బలవంతం చేశాడు. వీరిలో కొందరు.. తమ భార్యలను ఒకరితో మరొకరు మార్చుకుంటూ అసహజ లైంగిక చర్యలకు పాల్పడేవారు. ఈ క్రమంలో సదరు మహిళ.. భర్త చేష్టలతో విసిగిపోయి వేరే వ్యక్తులతో అసహజ లైంగిక చర్యకు నిరాకరించింది. దీంతో మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు.. పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు.
భారీ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన పోలీసులు, వీఐపీల పేరుతో బెదిరించిన నిర్వాహకురాలు...
వీరి విచారణలో అనేక షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా టెలిగ్రామ్, మెసెంజర్‌లతో సంప్రదించుకునేవారని పోలీసులు గుర్తించారు. వీరి పార్ట్‌నర్ స్వాపింగ్ చాట్ గ్రూపులో వేలాది మంది యువతి,యువకులున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు గత ఆదివారం నిందితులను కొట్టాయం, అలప్పుజ,ఎర్నాకులం జిల్లాల నుంచి అరెస్టు చేశారు. ప్రస్తుతం పార్ట్‌నర్ స్వాపింగ్ రాకెట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఈ ముఠా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ను వాడుకుంటూ ఈ కార్యకలాపాల్లో యాక్టివ్ గా ఉందని పోలీసులు చెబుతున్నారు. తొలుత వీరు టెలిగ్రాం, మెజేంజర్ గ్రూపు ద్వారా కలుసుకున్నట్లు వెల్లడైందని ఫిర్యాదుదారి భర్తను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.