Mumbai, Feb 22: ఎమ్మెల్యేలు, ఎంపీలు, బ్యూరోక్రాట్లు, జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకున్న సెక్స్‌టార్షన్ రాకెట్ గుట్టును ముంబై పోలీసులు రట్టు చేశారు. మహిళల నకిలీ ప్రొఫైల్స్ ఉపయోగించి ప్రసిద్ధ వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి, వారు అశ్లీలాన్ని చూసేలా చేసి అపఖ్యాతికి గురిచేయడం ఈ ముఠా ముఖ్య లక్ష్యంగా తెలుస్తోంది. రాజస్థాన్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
సమాజంలో మంచి హోదాలో ఉన్న వ్యక్తులను లక్ష్యంగా (Sextortion racket) చేసుకుని వ్యక్తికి మహిళల నకిలీ ప్రొఫైల్స్‌తో చేసిన ఫేస్‌బుక్ రిక్వెస్ట్ పంపుతారు. ఆ వ్యక్తులు రిక్వెస్ట్ యాక్సప్ట్ చేయగానే వారితో ఛాటింగ్ చేయడం ప్రారంభించి వారిని ముగ్గులోకి దింపుతారు. ఆ తరువాత వీడియో కాల్స్ ద్వారా వారికి న్యూడ్ గా కనిపిస్తారు. వారు కూడా టెంప్ట్ అయి వీడియో కాల్ లో నగ్నంగా కనిపిస్తే ఇక అంతే సంగతులు.. ఆ వీడియోలను ఎడిట్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేస్తారు. వారికి ఎడిట్ చేసిన వీడియోలను పంపి అడిగినంత డబ్బు పంపాలని లేకుంటే ఈ వీడియోలను ఇంటర్నెట్లో పెడతానని బెదిరిస్తారు. సమాజంలో గౌరవంగా బతికేవారు చాలామంది వీరి ఉచ్చులో పడినట్లు తెలుస్తోంది. వారు భయపడి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదనే వార్తలు వస్తున్నాయి.
ఈ ముఠా వ్యక్తులపై ఎవ వేసేందుకు దాదాపు 171 నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్ సిద్దం చేసి 4 టెలిగ్రామ్ ఛానెళ్లను ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ముఠాలోని ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు (Sextortion Racket Busted) చేశారు. వీరు నడుపుతున్న 58 బ్యాంకు ఖాతాలను పోలీసులు సీజ్ చేశారు. నిందితులు వాడిన 54 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులను ఈ ముఠా లక్ష్యంగా చేసుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడినట్లు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తిచారు. టైమ్స్ నౌ ఈ కథనాన్ని తెలిపింది.
కాగా సెక్స్‌టోర్షన్ రాకెట్‌కు సంబంధించి ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన 23 ఏళ్ల యువకుడిని డిబి మార్గ్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ (sextortion racket busted mumbai) చేశారు. ఈ ముఠా నగరాల్లోని అనేక మంది వ్యక్తుల నుండి డబ్బును దోచుకున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెలలో గ్రాంట్ రోడ్ నివాసి ఫిర్యాదు ఆధారంగా దాఖలు చేసిన మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) కు సంబంధించి నిందితుడు అనుప్సింగ్ భూపేంద్రసింగ్ బాధోరియాను అరెస్టు చేశారు. ఈ కథనాన్ని హిందూస్థాన్ టైమ్స్ ప్రచురించింది.
ఫిర్యాదుదారుడు గత ఏడాది డిసెంబర్‌లో సోషల్ మీడియా సైట్‌లో ఒక మహిళ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ అందుకున్నాడు. ఫిర్యాదుదారుడు అభ్యర్థనను అంగీకరించాడు మరియు ఇద్దరూ చాటింగ్ ప్రారంభించారు. కొంతకాలం తర్వాత, ఆ మహిళ సంప్రదింపు నంబర్లను మార్పిడి చేయమని పట్టుబట్టి, అతనికి వీడియో కాల్ చేసింది. ఫిర్యాదుదారుడు కాల్ తీసుకున్నప్పుడు, ఆ మహిళ బట్టలు విప్పి, ఫిర్యాదుదారుడు బట్టలు తీసేలా చేసింది.
కొద్ది నిమిషాల తరువాత, ఫిర్యాదుదారుడికి మహిళ నంబర్ నుండి వీడియో కాల్ రికార్డింగ్ వచ్చింది. అతను రూ. 21,000 చెల్లించడంలో విఫలమైతే వీడియో క్లిప్‌ను ఫిర్యాదుదారుడి బంధువులు మరియు స్నేహితులకు పంపుతామని ఆమె బెదిరించినట్లు పోలీసులు తెలిపారు.అతను మహిళకురూ. 5,000 పంపించి, మిగిలిన వాటిని ఏర్పాటు చేయడానికి కొంత సమయం ఇవ్వమని కోరి, ఆపై డిబి మార్గ్ పోలీసులను సంప్రదించాడు.
పోలీసు అధికారులు కాల్ చేసినవారి కాల్ వివరాలను విశ్లేషించి, ఆ డబ్బును మొదట ఇ-వాలెట్ ఖాతాకు, అక్కడి నుంచి కొన్ని బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసినట్లు కనుగొన్నారు. “ఈ ఖాతాలలో ఒకటి భడోరియాకు చెందినది, అతన్ని అరెస్టు చేశారు. భడోరియా ఆగ్రాలో కొత్త బ్యాంకు ఖాతాలను తెరవడానికి ఏజెంట్‌గా పనిచేస్తాడు మరియు అనేక బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నాడు. దోపిడీ డబ్బును ఒక ఖాతా నుండి మరొక ఖాతాకు మళ్లించడంలో అతను పాల్గొన్నాడు. అతని బ్యాంక్ ఖాతాలలో అనుమానాస్పద లావాదేవీలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అతను సెక్స్టార్షన్ రాకెట్టులో సభ్యుడు ”అని డిబి మార్గ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజా బిడ్కర్ అన్నారు.