Omicron Cases in India: ఒకే కుటుంబంలో 9మందికి ఒమిక్రాన్, భారత్‌లో విజృంభిస్తున్న కొత్త వేరియంట్‌, ఆదివారం ఒక్కరోజే 17మందికి ఒమిక్రాన్ నిర్ధారణ, 21కి చేరిన మొత్తం కేసులు

ఆదివారం ఒక్కరోజే భారత్‌(India)లో కొత్తగా 17 ఒమిక్రాన్(Omicron) కేసులు వచ్చాయి. ఇందులో తొమ్మిది రాజస్థాన్‌(Rajasthan)లోని జైపూర్‌(Jayapura)లోని ఆదర్శనగర్‌లో వెలుగు చూశాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.

Coronavirus | Representational Image (Photo Credits: Pixabay)

New Delhi December 05: భారత్‌(India)లో ఒమిక్రాన్(Omicron) వేరియంట్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే భారత్‌(India)లో కొత్తగా 17 ఒమిక్రాన్(Omicron)  కేసులు వచ్చాయి. ఇందులో తొమ్మిది రాజస్థాన్‌(Rajasthan)లోని జైపూర్‌(Jayapura)లోని ఆదర్శనగర్‌లో వెలుగు చూశాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దక్షిణాఫ్రికా(South Afrcia) నుంచి తిరిగి వచ్చిన అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వీరికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఒకే కుటుంబంలో ఒమిక్రాన్(Omicron)  కేసులు బయటపడటంతో..వారు నివసించే నాగౌర్‌లోని రోహిసా ప్రాంతంలో రాజస్థాన్‌(Rajasthan) ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది.

అటు మహారాష్ట్ర(Maharastra)లోని పుణె(Pune)లో ఆదివారం ఏడుగురికి ఒమిక్రాన్(Omicron)  నిర్ధారణ అయింది. గత నెల 24న నైజీరియా నుంచి తిరిగి వచ్చిన 44 సంవత్సరాల మహిళతో పాటు ఐదుగురు బంధువులకు ఒమిక్రాన్‌(Omicron)  సోకింది. పుణెలోని పింప్రి చించ్వాడ్‌లో ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే నగరానికి చెందిన 47 సంవత్సరాల వ్యక్తి సైతం కొత్త వైరస్‌ బారినపడ్డట్లు తేలింది.

Omicron COVID Variant: 4 రోజుల్లో 12 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్ వేరియంట్, పెను ప్ర‌మాదం పొంచి ఉందని తెలిపిన ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ, డెల్టా క‌న్నా ఆరు రెట్లు ప్ర‌మాదక‌ర‌మ‌ంటున్న నిపుణులు

ఆదివారం ఒక్కరోజే మహారాష్ట్ర(Maharastra)లో ఏడు కేసులు రికార్డవగా.. శనివారం కళ్యాణ్‌ డోంబివాళిలో ఒకరు వైరస్‌ బారినపడ్డారు. అలాగే ఆదివారం ఢిల్లీలోనూ ఒకే కేసు నమోదైంది. కొత్త కేసులతో దేశంలో మొత్తం ఒమిక్రాన్‌(Omicron)  పాజిటివ్‌ కేసుల సంఖ్య 21కి పెరగ్గా.. రాజస్థాన్‌లో తొమ్మిది మంది, మహారాష్ట్రలో ఎనిమిది మంది, కర్నాటకలో ఒకరు, ఢిల్లీలో ఒకరు వైరస్‌ బారినపడ్డారు. ఒకే రోజు పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒమిక్రాన్(Omicron)  నిర్ధారణ అయిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులకు కూడా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు.