Swine Flu: దేశంలో స్వైన్ ఫ్లూ కలకలం, జార్ఖండ్‌లో మరో నాలుగు కేసులు నమోదు, రాంచీ ఆస్పత్రిలో చికిత్స, మరికొందరికి లక్షణాలు, అలర్టయిన ఆరోగ్యశాఖ అధికారులు
సాధారణంగా స్వైన్ ఫ్లూలో జ్వరం, చలి, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారడం, కళ్లు ఎర్రబారడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
Ranchi, AUG 28: దేశంలో ఒకవైపు కరోనా (Corona), మంకీపాక్స్ కేసులు (Monkey pox) తగ్గుముఖం పడుతుంటే మరోవైపు స్వైన్ ఫ్లూ (swine flu) కేసులు కలవరపెడుతున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో (Jarkhand) నలుగురికి స్వైన్ ఫ్లూ (swine flu) సోకింది. రాష్ట్ర రాజధాని రాంచీలోని ఒక ఆస్పత్రిలో నలుగురికి స్వైన్ ఫ్లూ సోకినట్లు అధికారులు వెల్లడించారు. బాధితులకు స్థానిక భగవాన్ మహావీర్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నలుగురితోపాటు ఇంకో ఇద్దరికి కూడా స్వైన్ ఫ్లూ (swine flu)లక్షణాలు ఉన్నాయని, వారికి సంబంధించిన ఫలితాలు సోమవారం వస్తాయని ఆసుపత్రి అధికారులు తెలిపారు. సాధారణంగా స్వైన్ ఫ్లూలో జ్వరం, చలి, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారడం, కళ్లు ఎర్రబారడం, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, అలసట, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి. వీటిలో చాలా వరకు లక్షణాలు కోవిడ్‌లో ఉంటాయి. దీంతో బాధితులు ఎక్కువగా ఈ లక్షణాలుంటే కోవిడ్ టెస్టులు చేయించుకుంటున్నారు. ఈ పరీక్షల్లో వారికి కోవిడ్ నెగెటివ్ వస్తోంది.
అయితే, ఈ లక్షణాలుంటే కోవిడ్‌తోపాటు స్వైన్ ఫ్లూ పరీక్షలు (swine flu Test) కూడా చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోస సమస్యలు ఎక్కువగా ఉంటే, వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. లేదంటే మాములు ఫీవర్‌గానే భావించాలని చెబుతున్నారు.
Noida Twin Towers Demolition: 3.. 2.. 1.. 0.. భూం... 15 సెకన్లలో విజయవంతంగా కూల్చేశారు..
రోగులు కోవిడ్ లక్షణాలు తీవ్రంగా ఉండి, నెగెటివ్ వస్తే స్వైన్ ఫ్లూ పరీక్షలు చేయించుకోవడం వల్ల ఈ వ్యాధి మరింత మందికి సోకకుండా కూడా చూసుకోవచ్చు. ఇక, హైదరాబాద్‌లో కూడా స్వైన్ ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు సమాచారం. ప్రతి వారం 15 వరకు స్వైన్ ఫ్లూ కేసులు వస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.