Noida, August 28: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత ప్రక్రియ విజయవంతమైంది. 3,700కిలోల పేలుడు పదార్థాలతో కేవలం 15 సెకన్లలోనే జంట భవనాలను కూల్చివేశారు. పోలీసుల నుంచి క్లియరెన్స్‌ రాగానే.. మీట నొక్కి పేలుళ్లు జరిపారు. మీట నొక్కేచోట ముగ్గురు విదేశీ నిపుణులు, పేల్చివేతల కంపెనీకి చెందిన చేతన్‌ దత్తా, ఓ పోలీసు అధికారి, ఎడిఫిస్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ మయూర్‌ మెహతా ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మీరూ చూడండి.

జంట భవనాలపై సంక్షిప్త సమాచారం

నోయిడా జంట భవనాల నిర్మాణం : 2012

రెండు జంట భవనాలు : అపెక్స్‌ (32 అంతస్తులు), సియాన్‌ (29 అంతస్తులు)

భవనాలకు చేసిన రంధ్రాలు : 9,600

నింపిన పేలుడు పదార్థాలు : 3,700 కేజీలకు పైగా

టవర్స్‌ నిర్మాణ వ్యయం : రూ.70 కోట్లు

కూల్చివేతకు ఖర్చు : రూ.20 కోట్లు

శిథిలాలు : 55,000 నుంచి 80 వేల టన్నులు

శిథిలాల తరలింపునకు పట్టే సమయం: 3 నెలలు