Horoscope Today: ఈ రోజు రాశి ఫలితాలు చూసుకున్నారా.. అనూహ్య ధన లాభం వచ్చే రాశులు ఇవే, అలాగే ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి
చంద్ర గ్రహం ప్రభావం కారణంగా ఈరోజు మిధున రాశి వ్యక్తులకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఇదే రోజున సోమ ప్రదోష వ్రతం కూడా వచ్చింది.
ఈ రోజు చంద్రుడు పగలు మరియు రాత్రి సమయంలో వృశ్చికరాశిలోకి సంచారం చేయనున్నాడు. చంద్ర గ్రహం ప్రభావం కారణంగా ఈరోజు మిధున రాశి వ్యక్తులకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఇదే రోజున సోమ ప్రదోష వ్రతం కూడా వచ్చింది. ఈ సమయంలో శివుడు మరియు తన కుమారుడు వినాయకుని ఆశీస్సుల కోసం ఏమి చేయాలి.. మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలొస్తాయి.. ఏ రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి.. ఏయే రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి.ఇప్పుడు తెలుసుకుందాం...
మేషం: ఈ రాశి వారికి ఈరోజు మంచి ఆదరణ లభిస్తుంది. మీరు ఇతరులపైనా చాలా ప్రభావం చూపుతారు. వ్యవహారాలలో జాప్యం. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.
వాస్తు విషయంలో ఈ తప్పులు చేయకండి, చేశారో లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, డబ్బు చేతిలో ఉండదు..
వృషభం: ఈ రాశి వారు ఈరోజు ప్రణాళిక ప్రకారం పనులను పూర్తి చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు లాభదాయకమైన ఫలితాలొస్తాయి. కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. సన్నిహితుల నుండి ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
మిథునం: ఈరోజు ఈ రాశి వారిలో సాహిత్యం, కళ, రచన, సంగీతం, సినిమా లేదా క్రీడల రంగానికి చెందిన వ్యక్తులు తమ ప్రతిభను కనబరిచేందుకు మంచి అవకాశాలను పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
కర్కాటకం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. కొత్త బాధ్యతలతో సతమతమవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
సింహం: ఆసక్తికర సమాచారం. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కన్య: కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
తుల: కుటుంబసభ్యుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృశ్చికం: పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూర్చుకుంటారు. సన్నిహితులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తులు వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. నూతన విద్యావకాశాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మీనం: సోదరులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు అధికమవుతాయి.