Covid in India: కరోనాపై అలసత్వం వద్దు, 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం, ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచన

లేనిపక్షంలో కరోనా మహమ్మారి నియంత్రణకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

COVID-19 Vaccination (Photo Credits: ANI)

New Delhi, April 21: దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి ఇంకా ముగియలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులపై 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యానా, ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై నిఘా పెట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. లేనిపక్షంలో కరోనా మహమ్మారి నియంత్రణకు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌..దేశంలో కరోనా మహామ్మారి ఇంకా ముగిసిపోలేదు, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మహమ్మారి నిర్వహణలో మనం సాధించిన విజయ నిర్వీర్యం కాక మునుపే మేల్కోవాలి. ఏ స్థాయిలోనైన అలసత్వం వహించకూడాదని ఆ లేఖలో తెలిపారు. కోవిడ్‌ కారణంగా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ రాష్టాలు, జిల్లాల్ల వారిగా పెరుగుతున్న కేసులు వైరస్‌ సంక్రమణని సూచిస్తోందన్నారు.

దేశంలో కొత్తగా 11,692 మందికి కరోనా, 66 వేలు దాటిన యాక్టివ్ కేసులు, గత 24 గంటల్లో 28 మంది మహమ్మారితో మృతి

అందువల్ల రోజువారిగా రాష్ట్రాలు, జిల్లాలోని పెరుగుతున్న కేసులు, పాజిటివిటీ రేటుని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టాలని రాజేష్‌ భూషణ్‌ నొక్కి చెప్పారు. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో యూపీ(1), తమిళనాడు(11), రాజస్తాన్‌(6), మహారాష్ట్ర(8), కేరళ(14), హర్యానా(12), ఢిల్లీ(11) తదితరాల్లో మొత్తంగా 10%కి పైగా పాజిటివిటి రేటు ఉంది.

ఆయ జిల్లాలోని కోవిడ్‌ నిఘాను పటిష్టం చేస్తూ.. ఇన్‌ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI), తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ (SARI) వంటి కేసుల పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. కరోనా కేసులు పెరుగుతున్న జిల్లాలు, ప్రాంతాలపై దృష్టిసారించాలని, మరింతగా వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని ఆ ఎనిమిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా టెస్ట్‌లను పెంచడంతోపాటు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపే నమూనాల సంఖ్యను పెంచాలని పేర్కొంది. కాగా, దేశంలో శుక్రవారం కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 66,170కి పెరిగింది.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif