Rs 2,000 Notes Update: రెండు వేల నోటుపై ఆర్బీఐ కీలక ప్రకటన, రూ. 8,470 కోట్లకు తగ్గిన నోట్ల సర్క్యులేషన్, ఇంకా చెలామణిలో 2.4 శాతం నోట్లు

మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన తర్వాత, ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ ఫిబ్రవరి 29, 2024 నాటికి రూ.8470 కోట్లకు తగ్గిందని RBI తెలిపింది.

Rs 2,000 Notes Update

మే 19, 2023న చలామణిలో ఉన్న రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన తర్వాత, ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2000 నోట్ల మొత్తం విలువ ఫిబ్రవరి 29, 2024 నాటికి రూ.8470 కోట్లకు తగ్గిందని RBI తెలిపింది. రూ.3.56 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం రూ.2000 నోట్ల విలువ, వ్యాపారం ముగిసే సమయానికి రూ.8470 కోట్లకు తగ్గిందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. మే 19, 2023 నాటికి చెలామణిలో ఉన్న రూ. 2000 నోట్లలో 97.6 శాతం తిరిగి వచ్చాయని తెలిపింది. ఇంకా చెలామణిలో 2. 4 శాతం నోట్లు ఉన్నాయని తెలిపింది.

ఏడేళ్లకే ముగిసిన రూ. 2 వేల నోటు ప్రస్థానం, ప్రస్తుతం దేశంలో ఉన్న రెండు వేల రూపాయల నోట్ల సంఖ్య ఎంతో తెలుసా..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మే 19, 2023న రూ. 2000 డినామినేషన్ నోట్లను చలామణి నుండి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. రూ. 2000 నోట్ల ఉపసంహరణ స్థితిని కాలానుగుణంగా RBI ప్రచురించింది. దీనికి సంబంధించి చివరి పత్రికా ప్రకటన ఫిబ్రవరి 1, 2024న ప్రచురించబడింది.రూ. 2000 నోట్లను ఇండియా పోస్ట్ ద్వారా దేశంలోని ఏదైనా పోస్టాఫీసు నుండి తమ బ్యాంకు ఖాతాలకు జమ చేయడానికి RBI ఇష్యూ కార్యాలయాలకు పంపుతున్నారు. రూ.2000 నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని ఆర్‌బిఐ పేర్కొంది.