Prashant Bhushan Tweets Row: వ్యాక్సిన్ పనిచేయడం లేదని ప్రశాంత్ భూషణ్ ట్వీట్లు, తీవ్రంగా మండిపడిన డాక్టర్ ఎన్‌కే అరోరా, భూషణ్ ట్వీట్లు తప్పు దారి పట్టించేవిగా ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చిన ట్విట్టర్
కరోనా వ్యాక్సిన్‌ల భద్రతను, సమర్థతను తప్పుబట్టడం సరికాదని అరోరా వ్యాఖ్యానించాడు.
New Delhi,June 29: కరోనావైరస్ వ్యాక్సిన్‌లపై సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ (senior advocate Prashant Bhushan) చేసిన ట్వీట్లు విమర్శలకు దారితీశాయి. వ్యాక్సిన్‌ల పనితీరును పరిశీలించకుండానే నేరుగా ప్రజలకు టీకాలు వేస్తున్నారని, దీనివల్ల యువత ప్రమాదం బారినపడుతోందని ఆయన ట్విట్టర్లో ట్వీట్లు (Prashant Bhushan Tweets Row) చేశారు. దీనిపై సెంటర్ కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా (NK arora) తీవ్రంగా మండిపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ల భద్రతను, సమర్థతను తప్పుబట్టడం సరికాదని అరోరా వ్యాఖ్యానించాడు.
వ్యాక్సిన్ (Vaccination) వికటించిన తొలి మరణం వివరాలను కూడా మేం ప్రజలకు అందుబాటులో ఉంచామని..డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం.. వ్యాక్సిన్ వికటించిన ఘటనలపై దర్యాప్తు కూడా జరిపిస్తున్నామని తెలిపారు. ప్రజల్లో జ్వరాలు, నొప్పులు తప్పించి ప్రతికూల ప్రభావం చూపించిన కేసులు, సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని అన్నారు.
Here's Bhushan Tweets
ఐసీయూలో ఉన్నవాళ్లపై కూడా వ్యాక్సిన్‌లు సానుకూల ప్రభావం చూపిస్తున్నాయని.. ఈ విషయాలేవీ ఆయనకు కనబడడం లేదా? ఎందుకు గుర్తించడం లేదు? అంటూ భూషన్ ట్వీట్లకు అరోరా బదులిచ్చాడు.
ఇదిలా ఉంటే తప్పుడు సమాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్విటర్.. ప్రశాంత్ భూషణ్ వ్యవహారంలో త్వరితగతిన స్పందించింది. ఆయన ట్వీట్లు తప్పుడు దారి పట్టించేవిగా ఉన్నాయని నోటిఫికేషన్ ఇచ్చింది. అంతేకాదు వ్యాక్సిన్ భద్రతపై ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నాయో చూడండని సూచించాయి. ఈ మేరకు త్వరలోనే ఆయన ట్వీట్లను ట్విటర్ తొలగించే ఆస్కారం కూడా లేకపోలేదు.
కాగా పదిరోజుల వ్యాక్సిన్ తీసుకున్న 45ఏళ్ల మహిళ మరణించడం.. ఆమె మృతికి వ్యాక్సిన్ కారణమని ఆమె భర్త ఆరోపించడం నేపథ్యంగా ఓ పేపర్‌లో కథనం పబ్లిష్ అయ్యింది. ఆ కట్టింగ్‌ను, వ్యాక్సిన్ పనితీరు వేస్ట్ అనే ఓ వెబ్ ఆర్టికల్‌ను తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన ప్రశాంత్ భూషణ్.. యువత మీద, కరోనా నుంచి కోలుకున్న వాళ్ల మీద పరీక్షించకుండానే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారంటూ విమర్శలకు దిగారు. కరోనాతో చనిపోయే అవకాశాలు మాత్రమే యువతకు ఉండేవని, కానీ, వ్యాక్సిన్‌తో ఆ అవకాశాలు మరింత ఎక్కువయ్యాయని మరో ట్వీట్ చేశాడు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లు సహజంగా ఇమ్యూనిటీని సంపాదించుకుంటున్నారని, అలాంటి వాళ్ల ఇమ్యూనిటీని కూడా వ్యాక్సిన్ దెబ్బతీస్తోందని ఆయన కామెంట్లు చేశాడు.