Shirdi Temple Closed Down: కరోనా దెబ్బ, షిర్డీ ఆలయం మూసివేత, నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి అమల్లోకి, తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు భక్తులకు సాయి దర్శనం ఉండదు

కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా ఆలయంలోకి భక్తులను అనుమతించొద్దని (Shirdi Saibaba Temple to Shut) నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

Sai Baba (Image credit: Facebook/Shirdi Sai Baba Temple Trust)

Shirdi, Mar 17: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ (coronavirus outbreak) మహమ్మారి ప్రభావం ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీ (Shirdi) పైనా పడింది. కరోనా వైరస్ ప్రభావంతో దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన షిర్డీ సాయిబాబా ఆలయంలోకి భక్తులను అనుమతించొద్దని (Shirdi Saibaba Temple to Shut) నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.

దేశవ్యాప్తంగా 125కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య

షిర్డీ సాయి ఆలయాన్ని (Shirdi Saibaba Temple) మూసివేయనున్నందున భక్తులు ఎవరూ రావద్దొని ట్రస్ట్ తెలిపింది.తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆలయం మూసి వేసి ఉంటుందని వెల్లడించారు. ఇప్పటికే మహారాష్ట్రలోని ప్రముఖ ఆలయాలు సిద్ధి వినాయక, ముంబా దేవి టెంపుల్స్ ను మూసివేసిన (Several prominent temples in Maharashtra) సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో షిర్డీకి రావొద్దని భక్తులను ఇదివరకే కోరారు. షిర్డీ టూర్ ని కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు.

Here's ANI Tweet

ఇదిలా ఉంటే ముంబై సిద్ధి వినాయక ట్రస్ట్ సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. ఆలయాన్ని మూసివేస్తున్నట్టు సోమవారం(మార్చి 16,2020) ప్రకటించింది. పుణెలోని శ్రీమంత్ గణపతి మందిర్, ముంబైలోని ముంబాదేవి ఆలయాలను కూడా మూసివేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ దేవాలయాలు మూసివేసి ఉంటాయి.

ఢిల్లీలో తొలి కరోనా బాధితుడు పూర్తిగా కోలుకున్నాడా?

కాగా కరోనా వైరస్ భయాందోళనల కారణంగా దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన తాజ్ మహల్‌ను మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు

కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. జన సమూహాలపై ఆంక్షలు పెట్టింది. జనాలు ఎక్కువగా ఉన్న చోట కరోనా వేగంగా వ్యాప్తించే అవకాశం ఉండటంతో ఈ చర్యలు తీసుకుంది. కరోనా కట్టడిలో భాగంగానే షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించింది.

కరోనా దెబ్బకి మహారాష్ట్ర విలవిల

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటివరకు మన దేశంలో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడ్డవారిలో ముగ్గురు చనిపోయారు. భారత్ లో మూడో మరణం మహారాష్ట్రంలోనే చోటు చేసుకుంది. మంగళవారం(మార్చి 17,2020) ముంబైలోని కస్తూర్భా హాస్పిటల్ లో కరోనా ట్రీట్మెంట్ పొందుతున్న 64ఏళ్ల వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో భారత్‌లో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య మూడుకి చేరింది. గతవారంలో కర్ణాటకలోని కలబుర్గికి చెందిన ఓ వృద్ధుడు, ఢిల్లీకి చెందిన మరో వృద్ధుడు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.



సంబంధిత వార్తలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Vijay on Amit Shah Comments: డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడిన హీరో విజయ్, కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే ఎలర్జీ అని వెల్లడి

CM Siddaramaiah: అమిత్ షా వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమే, వీడియోని షేర్ చేస్తూ మండిపడిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

Parliament Winter Session 2024: బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సిందేనని ఇండియా కూటమి డిమాండ్, కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని మండిపడిన బీజేపీ, వేడెక్కిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif