IPL Auction 2025 Live

CJI NV Ramana: సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు, తీర్పులకు కొందరు వక్రభాష్యం చెప్తున్నారు, పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక, సీఎం కేసీఆర్ పై ప్రశంసలు

ఏ ఒక్కరి కోసం న్యాయవ్యవస్థ పని చేయదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ (Court) స్వార్థపరుల కోసం పనిచేసే వ్యవస్థ కాదని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థ లక్ష్యమన్నారు. తెలంగాణలో (Telangana) కొత్త జిల్లాల కోర్టులను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.

Justice NV Ramana (Photo Credits: PTI)

New Delhi, June 02: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ (CJI NV Ramana) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్కరి కోసం న్యాయవ్యవస్థ పని చేయదని స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ (Court) స్వార్థపరుల కోసం పనిచేసే వ్యవస్థ కాదని స్పష్టం చేశారు. సమాజ శ్రేయస్సే న్యాయ వ్యవస్థ లక్ష్యమన్నారు. తెలంగాణలో (Telangana) కొత్త జిల్లాల కోర్టులను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కోర్టు తీర్పులపై కొందరు వక్ర భాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. తీర్పులను తప్పుపట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దురదృష్టకరమన్నారు. వ్యవస్థలను చక్కబెట్టుకోలేని వారు కోర్టులను తప్పుబడుతున్నారని పేర్కొన్నారు.

CJI NV Ramana: చేతికి ఎముక లేదనడానికి ట్రేడ్‌మార్క్‌ సీఎం కేసీఆర్, న్యాయాధికారుల సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించిన సీజేఐ ఎన్వీ రమణ  

పరిధి దాటి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అలాంటి వారిపై రాజ్యాంగపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాస్వామ్య మనుగడ సాగాలంటే న్యాయ వ్యవస్థ కీలకం అన్నారు. న్యాయ వ్యవస్థకు అందరూ మద్దతివ్వాలని తెలిపారు. ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహణ పెరిగిందన్నారు. సంక్షేమ పాలన అందించడం రాజ్యాంగం కల్పించిన బాధ్యత అన్నారు.

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ ప్రభుత్వం తేనీటి విందు, ఆత్మీయ ఆహ్వానం మేరకు హాజరైన సీజేఐ 

రాష్ట్రాభివృద్ధికి న్యాయశాఖ (Law ministry) అభివృద్ధి కూడా అవసరం చెప్పారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడు కేసులు సత్వరం పరిష్కారమవుతున్నాయని తెలిపారు. సంక్షేమ పాలనే ధ్యేయంగా కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలో దేశానికే తెలంగాణ ఆదర్శమన్నారు. చాలా ఏళ్ల తర్వాత న్యాయ వికేంద్రీకరణ జరిగిందన్నారు. 8 ఏళ్ల కింద అద్భుతమైన ఉద్యమం జరిగిందన్నారు. కొత్త రాష్ట్ర భవిష్యత్ పై గతంలో సందేహాలుండేవి..ఎనిమిదేళ్లలో ఆ అనుమానాలన్నీ తొలగిపోయాయని తెలిపారు.