Amaravathi December 26: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ (CJI NV Ramana)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(AP Government) తేనీటి విందు ఇచ్చింది. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్(CM YS Jagan) పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి హాజరైన సీజేఐ ఎన్వీ రమణకు సీఎం వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు, మంత్రులు పాల్గొన్నారు. ఈ తేనీటి విందుకు హాజరైన వారిలో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు ఏపీ, తెలంగాణ చీఫ్ జస్టిస్‌లు, రెండు రాష్ట్రాల న్యాయమూర్తులు ఉన్నారు. అంతకుముందు నోవాటెల్ హోటల్‌లో సీజేఐ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన తేనీటి విందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ నూతలపాటి వెంకటరమణ హాజరయ్యారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ దంపతులు సీజేఐను సాదరంగా ఆహ్వానించి హై టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1/2 pic.twitter.com/WpXWoC56I6
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 25, 2021
గత రెండు రోజులుగా సీజేఐ ఎన్వీ రమణ ఏపీలో పర్యటిస్తున్నారు. శుక్రవారం నాడు ఆయన తన స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ ఘన స్వాగతం లభించింది.