Petrol-Diesel Price Hike in Karnataka: వాహనదారులకు బిగ్ షాక్, భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఏకంగా ఎంత పెంచారంటే?
పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బెంగళూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.99.84గా ఉండగా, డీజిల్ ధర రూ.85.93గా ఉంది.
Bangalore, June 15: వాహనదారులకు బిగ్ షాక్.. కర్ణాటకలో (Karnataka) ఇంధన ధరలు పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 15న పెట్రోల్ (Petrol Diesel Prices), డీజిల్‌పై పన్ను పెంచడంతో ఇంధన ధరలు రూ.3 పెరిగాయి. కొత్త ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కర్ణాటక ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం.. కర్ణాటక సేల్స్ ట్యాక్స్ (KST) పెట్రోల్‌పై 25.92 శాతం నుంచి 29.84 శాతం, డీజిల్‌పై 14.3 శాతం నుండి 18.4 శాతానికి పెరిగింది. పెరిగిన ధర తక్షణమే అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. బెంగళూరులో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.99.84గా ఉండగా, డీజిల్ ధర రూ.85.93గా ఉంది.
రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న అమ్మకపు పన్నును రాష్ట్ర ప్రభుత్వం సవరించడంతో ఇంధన ధర పెరిగిందని పెట్రోలియం డీలర్ల సంఘం పేర్కొంది. బెంగళూరులో లీటరు ధర రూ. 99.84 నుంచి రూ. 102.84కి పెరిగింది. అదే విధంగా డీజిల్ ధర రూ.3.02 పెరగడంతో లీటరు ధర రూ.85.93 నుంచి రూ.88.95కి పెరిగింది.
లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇంధన ధరల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.50 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంధన ధరల పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.2,500 నుంచి రూ.2,800 కోట్ల వరకు భారం పడుతుందని ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
గ్యారెంటీలకు నిధులకు అదనపు ఆదాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆస్తుల మార్గదర్శక విలువను 15శాతం నుంచి 30 శాతం పెంచింది. భారతీయ నిర్మిత మద్యం (IML)పై అదనపు ఎక్సైజ్ సుంకం (AED) అన్ని స్లాబ్‌లపై 20 శాతం, బీర్‌పై ఏఈడీ విధించింది. 175 శాతం నుంచి 185 శాతం వరకు కొత్తగా నమోదు చేసుకున్న రవాణా వాహనాలపై 3 శాతం అదనపు సెస్ విధించారు. రూ. 25 లక్షల కన్నా ఎక్కువ ఉన్న ఈవీలపై(ఎలక్ట్రిక్ వాహనాలు) జీవితకాల పన్నును ప్రవేశపెట్టింది.