Gujarat Shoker: బాలుడ్ని క్లాస్‌రూంలోనే బట్టలు విప్పించి వీడియో తీసిన ప్రిన్సిపాల్, వీడియోను సోషల్ మీడియాలో వైరల్‌ చేసిన కీచకుడు, తల్లిదండ్రుల ఫిర్యాదుతో జాబ్‌ నుంచి సస్పెన్షన్

విషయం తెలుసుకొని విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సదరు ప్రిన్సిపాల్‌ను (principal) విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Surat, July 31: గుజరాత్‌  సూరత్ (Surat) నగరంలోని మున్సిపల్ పాఠశాల ప్రిన్సిపాల్‌ (principal) టీనేజ్ విద్యార్థిని లైంగికంగా వేధించిన ఆరోపణలపై ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకొని విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు సదరు ప్రిన్సిపాల్‌ను (principal) విధుల నుంచి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బాధితుడు 14ఏళ్ల బాలుడు. మున్సిపల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు. విద్యార్థి ఒంటిపై దుస్తులు (clothes removed) తీయించివేశాడు. అంతటితో ఆగకుండా మొబైల్ తో వీడియో తీసి వికృతానందం పొందాడు. మిగతా విద్యార్థులు సదరు విద్యార్థిని ఎగతాళి చేస్తున్నా ప్రిన్సిపల్ పట్టించుకోలేదు.

Maharashtra: నీ వల్లనే గర్భం వచ్చిందంటూ రూ.67 లక్షలు వసూలు! ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రియుడ్ని బ్లాక్‌మెయిల్ చేసిన యువతి, సామాజిక కార్యకర్తనంటూ యువకుడ్ని హడలెత్తించిన నిందితులు, హడలెత్తిపోయి ఎంత అడిగితే అంత ఇచ్చిన వ్యక్తి 

ఈ విషయం విద్యార్థి తల్లిదండ్రులకు తెలియడంతో విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు పాఠశాల ప్రిన్సిపాల్ ను వేరే స్కూల్ కు బదిలీ చేశారు. అయితే తల్లిదండ్రులు జూలై 19న పునా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫోక్సో చట్టంలోని సెక్షన్ -12 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు కావటంతో సదరు ప్రిన్సిపల్ పరారయ్యాడు.

Specially-Abled Zomato Agent: వీల్‌ఛైర్‌పై ఫుడ్‌ డెలివరీ చేస్తున్న దివ్యాంగుడు, హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు, వీల్‌ఛైర్‌లో ఫుడ్‌డెలివరీ చేస్తూ బతుకుబండి ఈడుస్తున్న చెన్నైవాసి, గొప్పస్పూర్తికి సలాం కొడుతున్నామంటూ కామెంట్లు, వైరల్‌గా మారిన వీడియో! చూడండి 

పోలీసుల దర్యాప్తులో భాగంగా ప్రిన్సిపల్ ఆచూకీ తెలియడంతో అతడు ఉన్న ప్రాంతానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ప్రిన్సిపాల్ ను వేరే పాఠశాలకు ట్రాన్స్ ఫర్ చేసిన తరువాత విచారణ చేపట్టిన విద్యాశాఖ అధికారులు, విచారణ అనంతరం ప్రిన్సిపాల్ ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.