Pune, July 31: చీటింగ్ చేయడంతో కొత్త కొత్తదారులు వెతుక్కుంటున్నారు మనుషులు. తనతో సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రెగ్నెన్సీ పేరుతో ఏకంగా రూ.67 లక్షలు మోసం చేసింది ఓ యువతి. నీ వల్లనే గర్భం (pregnant) వచ్చిందంటూ అతన్ని బెదిరించి పెద్దమొత్తంలో వసూలు ( blackmailed) చేసింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో (Pune) జరిగింది. తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ మేరకు అతడ్ని మోసగించి పారిపోయింది. దీంతో బాధిత వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి అయిన బంధువు వద్ద 26 ఏళ్ల వ్యక్తి పని చేస్తున్నాడు. ఈ ఏడాది జనవరిలో కోరెగావ్ భీమా (Koregaon Bhima) ప్రాంతంలోని ఒక లాడ్జిలో బస చేసిన సమయంలో ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమెతో సంబంధానికి దారి తీసింది. దీంతో ఆ మహిళకు అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. కాగా, ఆ మహిళ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ వ్యక్తిని బ్లాక్‌మెయిల్ (blackmailed) చేసింది.
హడప్సర్‌లో నివాసం ఉండే 26 ఏళ్ల చేతన్ రవీంద్ర హింగ్‌మీర్‌ను భర్తగా, 27 ఏళ్ల నిఖిల్ అలియాస్ గౌరవ్ మ్హెత్రేని సామాజిక కార్యకర్తగా పరిచయం చేసింది. తాను ప్రెగ్నెంట్ అని, రేప్ కేసు పెడతానంటూ ఆ వ్యక్తిని బెదిరించింది. దీంతో ఆ ముగ్గురు కలిసి అతడి నుంచి పలు దఫాలుగా రూ.67.07 లక్షలు వసూలు చేశారు.
అయితే మరింతగా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో ఆ వ్యక్తి కోంద్వా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ హేమంత్ పాటిల్ నేతృత్వంలో క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన యాంటీ ఎక్స్‌టార్షన్ సెల్ బృందం రంగంలోకి దిగింది. ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. మహిళ స్నేహితులైన రవీంద్ర, నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఆ మహిళ కోసం గాలిస్తున్నారు.