Shiv Sena Leader Sanjay Raut. (Photo Credits: ANI)

Mumbai, July 31: శివసేన ముఖ్యనేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ఆదివారం అరెస్టు చేశారు. పత్రాచల్ భూ కుంభకోణంలో(మనీలాండరింగ్‌ కేసు) (Patra Chawl Land Scam Case) సంజయ్ రౌత్ ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులు రావడంతో విచారించిన ఈడీ అతన్నిఅదుపులోకి (ED Detains Shiv Sena Leader Sanjay Raut ) తీసుకుంది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ముంబైలోని ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన కొద్ది గంటలకే అదుపులోకి తీసుకున్నారు.

సంజయ్ రౌత్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన ఇంటివద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అధికారులు తనను తీసుకెళ్లే సమయంలో ఇంటికి వచ్చిన శివసేన కార్యకర్తల వైపు చూసి రౌత్ అభివాదం చేశారు. ముంబైని కేంద్ర పాలిత ప్రాంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నాలు, సంచలన వ్యాఖ్యలు చేసిన శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్

ఈ స్కాంలో ఇదివరకు రెండుసార్లు ఆయనకు సమన్లను జారీ చేశారు. కానీ, ఆయన ఈడీ అధికారుల నోటీసులకు స్పందించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్లలేదు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ ఈడీ ఆఫీసులో హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులే ఆదివారం తెల్లవారుజామున ముంబైలోని రౌత్‌ ఇంటికి వెళ్లి ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు.

Watch ANI Video

అనంతరం అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు.. సంజయ్‌ రౌత్‌ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీకి భయపడను అంటూ కామెంట్స్‌ చేశారు. ఏప్రిల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన విచారణలో భాగంగా మిస్టర్ రౌత్ భార్య వర్షా రౌత్, ఆయన సహచరులకు చెందిన సుమారు రూ. 11.15 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన విషయం తెలిసిందే.