Darbhanga, July 31: రోజు 24 గంటలు కష్టపడి చదివితే కూడా పరీక్షల్లో 100కు వంద మార్కులు రావడం కష్టమే. కానీ బీహార్‌లో (Bihar) ఓ విద్యార్ధికి 100కు ఏకంగా 151 మార్కులు వచ్చాయి. దీంతో బిత్తరపోవడం విద్యార్ధి వంతయింది. బీహార్‌లోని (Bihar) దర్బంగా జిల్లాకు (Darbhangas) చెందిన లలిత్ నారాయణ మిథిలా యూనివర్సిటీ (Lalit Narayan Mithila University) ఈ ఘనకార్యానికి పాల్పడింది. బీఏ (హనర్స్) చదువుతున్న ఓ విద్యార్ధికి పొలిటికల్ సైన్స్ లో (Political Science paper) ఏకంగా 100కు 151 మార్కులు (151 out of 100 ) వేశారు. ప్రొవిజినల్ సర్టిఫికెట్‌లో తన మార్కులను చూసుకున్న విద్యార్ధి షాక్‌కు గురయ్యాడు. ఈ విషయాన్ని యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు.
అయితే మరో విద్యార్ధికి కూడా అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ పేపర్‌లో సున్నా మార్కులు వచ్చినట్లు ప్రొవిజనల్ సర్టిఫికెట్ ఇచ్చారు. మెరిట్ స్కూడెంట్ అయిన తనకు...జీరో మార్కులు రావడంతో యూనివర్సిటీని సంప్రదించాడు. దాంతో ఈ ఇద్దరు విద్యార్ధుల మార్కుల వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది.
అయితే తప్పు ఎక్కడ జరిగిందని విచారణ జరిపిన అధికారులకు...అసలు విషయం అర్ధమయింది. టైపింగ్ మిస్టేక్ (typographical errors) వల్ల ఈ ఇద్దరికి మార్కులు తప్పుగా పడ్డాయని గుర్తించారు. దాంతో వారికి కొత్త ప్రొవిజనల్ సర్టిఫికెట్లు జారీ చేశారు. 100కు 151 మార్కులు వచ్చాయన్న వార్తలు వైరల్‌గా మారడంలో ఆ యూనివర్సిటీకి చెందిన మిగిలిన విద్యార్ధులు తమకు కూడా టైపింగ్ మిస్టేక్ వల్ల తక్కువ మార్కులు వచ్చాయోమో అనే అనుమానంలో పడ్డారు.