Jail For Tamil Nadu Ex DGP: సీఎం బందోబస్తులో ఉండగా తోటి ఐపీఎస్‌ను లైంగికంగా వేధించిన మాజీ డీజీపీ, మూడేళ్లు జైలుశిక్ష విధించిన తమిళనాడు కోర్టు

కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా విధించింది. అతనికి సహకరించిన ఎస్పీ కన్నన్‌కి రూ.500 జరిమానా విధించింది.

Jail For Tamil Nadu Ex DGP (PIC@ twitter)

Chennai, June 16: తోటి ఐపీఎస్ అధికారిణి(woman IPS officer)ని లైంగిక వేధించిన కేసులో తమిళనాడు మాజీ డీజీపీ (EX director general of police (DGP) రాజేశ్ దాస్‌( Rajesh Das )కి జైలు శిక్ష విధించింది విల్లుపురం కోర్టు(Villupuram Chief Judicial Magistrate). కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా కూడా విధించింది. అతనికి సహకరించిన ఎస్పీ కన్నన్‌కి రూ.500 జరిమానా విధించింది. తమిళనాడు (Tamil nadu)మాజీ డీజీపీ రాజేశ్ దాస్‌ (EX director general of police (DGP)) దోషిగా తేలారు. ఈ తీర్పుపై 30 రోజుల్లో ఆయన అప్పీలుకు వెళ్లచ్చని పేర్కొంటూ, బెయిల్ కూడా మంజూరు చేసింది. రాజేశ్ దాస్‌పై ఫిర్యాదు చేసేందుకు చెన్నై వెళ్తున్న బాధిత మహిళా అధికారిని అడ్డుకున్నారు. ఆమెను బెదిరించారు. దీనికి ఆయన్ని కూడా దోషిగా తేలుస్తు రూ.500 జరిమానా విధించింది. ఈ కేసులో పోలీసు సిబ్బంది సహా దాదాపు 70 మంది వ్యక్తుల వాంగ్మూలాలను కోర్టు నమోదు చేసింది.

Doctors Leave Scissors Inside Body: గుండె స‌ర్జ‌రీ చేసి శరీరంలోనే కత్తులను వదిలేసిన డాక్టర్లు, పేషెంట్ మృతి, ఆస్పత్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి ఫ్యామిలీ 

అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి సభకు బందోబస్తు నిర్వహించేందుకు వాహనంలో వెళ్తున్న సమయంలో తనను లైంగికంగా వేధించారని అప్పుడు ఐపీఎస్‌ అధికారి హోదాలో ఉన్న రాజేశ్ దాస్‌ పై మహిళా ఐపీఎస్ అధికారి 2021 మార్చి1న ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకుంది ఆనాటి అన్నాడీఎంకే ప్రభుత్వం. రాజేశ్ దాస్‌ను సస్పెండ్‌ చేసింది. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ వేసి విచారణ జరిపించింది. నిజమని నిర్ధారణ కావటంతో దాస్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, పోలీస్ కానిస్టేబుల్‌ను లారీతో తొక్కి చంపిన ఇసుక మాఫియా, సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించిన మంత్రి ప్రియాంక్ ఖర్గే 

సీఎం బందోబస్తుకు వెళ్లిన సమయంలో వాహనంలో ఉండగా రాజేశ్ దాస్‌ తన చేయి పట్టుకున్నారని..విడిచిపించుకున్నా మరోసారి పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని..ఏవేవో పాటలు పాడుతు తనను పలు విధాలుగా వేధించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 20 నిమిషాలపాటు తన చేయిని బలవంతంగా పట్టుకున్నారని తాను తన చేతిని విడిపించుకున్నా మళ్లీ మళ్లీ చేయి పట్టుకుని వేధించారని అలాగే నా ఆఫీసుకుకు దాస్ వచ్చినప్పుడు తనను పదే పదే ఫోటోలు తీసేవారని వద్దని వారించి ఫోటోలు తీసి పిచ్చి పిచ్చి కామెంట్లు చేసేవారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించిన సమయంలో అలా చేయవద్దంటూ వేడుకున్నాడని కానీ తన తీరుమాత్రం మార్చుకోకుండా తనను ఇబ్బందిపెట్టేవాడని పేర్కొన్నారు. తనను భయపెట్టటానికి లొంగదీసుకోవటానికి తన అధీనంలో ఉన్న పోలీసు యంత్రాంగాన్ని కూడా ఉపయోగించాడని ఆరోపించారు. ఫిర్యాదు చేయబోతున్నానని తెలుసుకుని ఆమె పాదాలమీద పడి క్షమాపణ వేడుకుంటానని బ్రతిమాలాడని తన మామగారితో రాయబారం పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు ఆమె. ఇలా తోటి ఐపీఎస్ అధికారిని వేధించిన కేసులో మాజీ డీజీపీకి విల్లుపురం జ్యుడిషియల్ కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది.