Tamil Nadu Extends Lockdown: మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ పొడిగింపు, కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌, వైరస్‌ వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులు

ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెల 7న ఉదయం 6 గంటలతో ముగియనుంది. ప్రస్తుతం కరోనావైరస్‌ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడగిస్తూ (Tamil Nadu Extends Lockdown) సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు.

Coronavirus Lockdown. Representative Image (Photo Credit: PTI)

Chennai, June 5: తమిళనాడులో మరో వారం రోజుల పాటు ప్రభుత్వం లాక్‌డౌన్‌ను పొడగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ఈ నెల 7న ఉదయం 6 గంటలతో ముగియనుంది. ప్రస్తుతం కరోనావైరస్‌ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో 14వ తేదీ ఉదయం 6 గంటల వరకు పొడగిస్తూ (Tamil Nadu Extends Lockdown) సీఎం ఎంకే స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు. వైరస్‌ (COVID-19 Pandemic) వ్యాప్తి తక్కువ ఉన్న పలు జిల్లాలకు సడలింపులను ప్రకటించారు. షాపింగ్‌ కాంప్లెక్స్‌, మాల్స్‌, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేటర్‌, సెలూన్ షాపులు రాష్ట్రవ్యాప్తంగా మూసి ఉంచనున్నారు.

కోయంబత్తూర్‌, నీలగిరి, తిరుప్పూర్‌, ఈరోడ్‌, సేలం, కరూర్‌, నమక్కల్‌, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్నం, మాయిలదుతూరై జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా ఉండడంతో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 11 జిల్లాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా సడలింపులుంటాయని ప్రభుత్వం తెలిపింది. కిరాణ దుకాణాలు, చేపలు, మాంసం, కూరగాయలు, పండ్లు, పూల దుకాణాలు ఉదయం 6 గంటల నుంచి 5 గంటల మధ్య తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

ఢిల్లీలో జూన్‌ 14 వరకు సడలింపులతో లాక్‌డౌన్‌, అన్‌లాక్‌ ప్రక్రియను మొదలు పెట్టిన ఢిల్లీ ప్రభుత్వం, మార్కెట్లు, మాల్స్‌ను సరి-బేసి పద్ధతిలో తెరవాలని సూచించిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌

అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం సిబ్బందితో పని చేయనున్నాయి. తక్కువ కేసులు నమోదవుతున్న జిల్లాల్లో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు పని చేస్తాయని, టోకెన్లలో 50 శాతం మాత్రమే జారీ చేస్తారని చెప్పారు. అపార్ట్‌మెంట్ల కోసం ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలు, హౌస్‌ కీపింగ్‌ సేవలను ఈ రిజిస్ట్రేషన్‌తో అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, కంప్యూటర్‌, మోటారు టెక్నీషియన్లు, వడ్రండుగులు ఈ రిజిస్ట్రేషన్‌తో ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసుకోవచ్చు.

ఎలక్ట్రికల్ వస్తువులు విక్రయించే దుకాణాలు, ద్విచక్ర వాహన వర్క్‌షాప్‌లు, హార్డ్‌వేర్ షాపులు, స్టేషనరీ దుకాణాలు, ట్రావెల్ ఆపరేటర్ల వాహన మరమ్మతు దుకాణాలు సాయంత్రం వరకు నిర్వహించుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే ఆటోలు, క్యాబ్‌లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఇంకా పలు సడలింపులు ఇచ్చింది. అయితే, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.