Tamil Nadu Suicides: తమిళనాడులో ఘోరం, కుటుంబాన్ని బలి తీసుకున్న ఆన్‌లైన్ లాటరీ, చనిపోతూ సెల్పీ వీడియో తీసుకున్న కుటుంబం
ఆ రాష్ట్రంలోని విల్లుపురం(Villupuram) సమీపంలోని సలామత్‌నగర్‌లో ఆన్‌లైన్ లాటరీ.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్‌లైన్ లాటరీలో మోసపోవడంతో కుటుంబ సభ్యుల అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్‌లైన్ లాటరీలో మోసపోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డారు.
Chennai, December 13: తమిళనాడు(Tamil Nadu)లో విషాదం చోటు చేసుకుంది. ఆ రాష్ట్రంలోని విల్లుపురం(Villupuram) సమీపంలోని సలామత్‌నగర్‌లో ఆన్‌లైన్ లాటరీ.. ఓ కుటుంబాన్ని బలి తీసుకుంది. ఆన్‌లైన్ లాటరీలో మోసపోవడంతో కుటుంబ సభ్యుల అందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు. తల్లిదండ్రులు తమ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఆన్‌లైన్ లాటరీలో మోసపోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు(Suicide) పాల్పడ్డారు.
ఆత్మహత్యకు ముందు ఆ కుటుంబం.. సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని.. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు అరుణ్, శివగామి, ప్రియదర్శిని(5), యువశ్రీ(3), భారతి(నాలుగు నెలలు)గా గుర్తించారు.
సెల్పీ వీడియోలో లాటరీలో డబ్బులు కోల్పోయి అప్పుల బాధ భరించలేక.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. తమలా ఎవరూ మోసపోవద్దని అందులో తెలిపారు. ఒకే రోజు 5 మంది చనిపోవడంతో తమిళనాడు పోలీసులు అలర్టయ్యారు. ఆన్‌లైన్ లాటరీ వ్యాపారం చేస్తున్న వారిపై ఆకస్మిక దాడులు చేశారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు.