Tamilian Heart Travels 350 KM: కాశ్మీరి మహిళకు గుండెను దానం చేసిన తమిళనాడు యువకుడు, హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ ద్వారా ఆమెకు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు, 350 కిలోమీటర్లు ప్రయాణించిని గుండె
హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ కశ్మీరీ మహిళకు ( Kashmiri Woman’s) బ్రెయిన్‌డెడ్‌తో గురైన చెన్నై యువకుడి గుండెను (Tamilian Heart) అమర్చి ప్రాణం పోశారు వైద్యులు.
జమ్మూ కాశ్మీర్‌లోని 33 ఏళ్ల మహిళ గుండె వైఫల్యంతో బాధపడుతోంది. అయితే తమిళనాడులో బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల యువకుడు అందించిన గుండె ద్వారా ఆమె తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హృద్రోగ సమస్యతో బాధపడుతున్న ఓ కశ్మీరీ మహిళకు ( Kashmiri Woman’s) బ్రెయిన్‌డెడ్‌తో గురైన చెన్నై యువకుడి గుండెను (Tamilian Heart) అమర్చి ప్రాణం పోశారు వైద్యులు. ప్రస్తుతం ఆ మహిళ పూర్తిగా కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది జనవరి 26వ తేదీన ఆమెకు వైద్యులు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జమ్మూకశ్మీర్‌కు చెందిన 33 ఏండ్ల మహిళ ఫాతిమా గతకొంత కాలం నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆమెను చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే బాధిత మహిళకు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరి అని వైద్యులు స్పష్టం చేశారు. తమిళనాడులోని తిరుచ్చిలో ఓ 18 ఏండ్ల యువకుడు జనవరి 26వ తేదీన బ్రెయిన్ డెడ్‌కు గురయ్యాడు. ఆ యువకుడిని గుండెను దానం చేసేందుకు ఐశ్వర్య ట్రస్ట్ సభ్యులు ఆ కుటుంబాన్ని ఒప్పించారు.
అనంతరం 350 కిలోమీటర్ల మేర గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసి తిరుచ్చి నుంచి చెన్నై ఎంజీఎంకు గుండెను తరలించారు. అదే రోజు ఫాతిమాకు ఈ యువకుడి గుండెను అమర్చారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకున్నది. గుండెను దానం చేసిన ఆ యువకుడి కుటుంబ సభ్యులకు ఫాతిమా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ గుండె ఆస్పత్రి నుండి మరో ఆస్పత్రికి మారడానికి దాదాపు 350 కిలోమీటర్లు (Tamilian Heart Travels 350 KM) ప్రయాణించింది.
ఫాతిమా తన వైద్య ఖర్చులు, మార్పిడి ఖర్చులను భరించలేని తన సోదరుడు, రోజువారీ కూలీతో నివసిస్తున్నాడు. ఆమెకు ఐశ్వర్య ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయం చేసింది. ఐశ్వర్య ట్రస్ట్ జనవరి 26న మహిళ గుండె మార్పిడికి నిధులు సమకూర్చడం ద్వారా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం అర్థవంతమైన మార్గం అని ట్రస్ట్ వ్యవస్థాపకులు చిత్రా విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారు.
MGM హెల్త్‌కేర్ సబ్సిడీతో ఈ మార్పిడిని ఆస్పత్రి యాజమాన్యం నిర్వహించింది. శస్త్రచికిత్సకు నాయకత్వం వహించిన డాక్టర్ KR బాలకృష్ణన్, "ఇంతటి విషాద సమయంలోనూ" అవయవ దానానికి అంగీకరించినందుకు దాత కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు.