Indore Tragedy: తండ్రి చేసిన చిన్న పొరపాటు బిడ్డ ప్రాణం తీసింది, ఎలుకల కోసం పెట్టిన బెల్లం తిన్న బాలిక, రెండు రోజలు మృత్యువుతో పోరాడి మృతి
ఓ తండ్రి నిర్లక్ష్యానికి 16 ఏళ్ల కుమార్తె బలైంది. ఎలుకలను చంపేందుకు పెట్టిన బెల్లాన్ని తిని (Eats Jaggery Laced With Rat Poison) ఓ బాలిక మృతి చెందింది. రవు పోలిస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓం ప్రకాశ్ రాథోడ్ కుమార్తె ఇంట్లో ఎలుకలు బాగా ఉండటంతో బెల్లానికి విషం రాసి ఓ చోట పెట్టాడు.
Indore, April 18: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి నిర్లక్ష్యానికి 16 ఏళ్ల కుమార్తె బలైంది. ఎలుకలను చంపేందుకు పెట్టిన బెల్లాన్ని తిని (Eats Jaggery Laced With Rat Poison) ఓ బాలిక మృతి చెందింది. రవు పోలిస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓం ప్రకాశ్ రాథోడ్ కుమార్తె ఇంట్లో ఎలుకలు బాగా ఉండటంతో బెల్లానికి విషం రాసి ఓ చోట పెట్టాడు. అయితే ఆ విషయం తెలియని అంజలి బెల్లం తిన్నది. దాంతో వాంతులు చేసుకోవడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ రెండు రోజుల పాటూ చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. అంజలి స్థానికంగా ఓ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. ఓ బంగ్లాలో తోటమాలిగా పనిచేస్తున్న ఓం ప్రకాశ్ కు అంజలి పెద్ద కుమార్తె.