Oh My Trump: 'నా దేవుడు ట్రంప్ భారత్ వచ్చాడు, త్వరలోనే ఆయన దర్శనం చేసుకుంటాను'. తెలంగాణలోని డొనాల్డ్ ట్రంప్ వీరభక్తుడి ఆనందం
త్వరలోనే తన దేవుడిని కలుసుకోగలననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదానికి అణిచివేయడంలో ట్రంప్ ప్రధాన పాత్ర పోషించారంటూ ట్రంప్ సేవలను బుస్స కృష్ణ కొనియాడుతున్నాడు......
Hyderabad, February: దేవుడికి భక్తులు ఉండటం సహజం. అలాగే తమకు నచ్చిన హీరోని, నాయకుడిని ఆరాధించే అభిమానులూ ఉంటారు. అందులోనే కొంతమంది ఫలానా హీరోకి, లేదా ఫలానా నాయకుడికి భక్తులని చెప్పుకుంటారు. కానీ, అంతకుమించి భక్తి, అందరినీ మించిన అభిమానంతో ఓ నిజమైన వీరభక్తుడు ఒకరు ఎక్కడో కాదు తెలంగాణలోనే (Telangana) ఉన్నాడు.
అతడి భక్తి మన దేశం దాటి, సరిహద్దులను దాటి, ఖండాతరాలను దాటి ఇంకెక్కడికో వెళ్లిపోయింది. మన దేశంలో ఉన్న వారందరినీ కాదని ఆ వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను తన దేవుడిగా (as God) భావిస్తున్నాడు, అంతేకాదు ఆయనకు 6 అడుగుల విగ్రహాన్ని నిర్మించి, ప్రతిరోజు పూజలు, వారంవారం ఉపవాసాలు చేస్తూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిష్టగా ట్రంప్ ను కొలుస్తున్నాడు.
జనగమ జిల్లాలోని బచ్చన్‌పేటకు చెందిన బుస్స కృష్ణ (Bussa Krishna) అనబడే వ్యక్తి గత ఆరేళ్లుగా డొనాల్డ్ ట్రంప్ ను దేవుడిగా కొలుస్తూ వస్తున్నాడు. నేడు అతడి ట్రంప్ నేరుగా భారత్ లో పర్యటిస్తున్నందున, ఇక ఆ వీరభక్తుడి ఆనందానికి హద్దులు లేవు. ఈ సందర్భంగా మీడియా వెళ్లి అతడిని ప్రశ్నించగా, "నా దేవుడు భారతదేశంలో పర్యటిస్తున్నందుకు గర్వంగా ఉంది" అని పేర్కొన్నాడు. త్వరలోనే తన దేవుడిని కలుసుకోగలననే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న ఉగ్రవాదానికి అణిచివేయడంలో ట్రంప్ ప్రధాన పాత్ర పోషించారంటూ ట్రంప్ సేవలను బుస్స కృష్ణ కొనియాడుతున్నాడు. ఆల్ రౌండ్ స్పీచ్‌తో అదరగొట్టిన డొనాల్డ్ ట్రంప్
Check this update from ANI:
బుస్స కృష్ణకు కొన్నేళ్ల కిందట డొనాల్డ్ ట్రంప్ కలలో కనిపించాడట, అప్పట్నించి తన జీవితంలో మంచి జరిగిందట. ఇక అప్పట్నించి ట్రంప్ ను ఆరాధిస్తూ వస్తున్నాడు. గతేడాది ట్రంప్ కు 6 ఏళ్ల విగ్రహం కూడా కట్టించి తన భక్తిని నిరూపించుకున్నాడు. గుడిలో దేవుడిని ఏ విధంగా కొలుస్తారో, ఏ విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో అదే రీతిలో ట్రంప్ ను కొలుస్తున్నాడు. ఇది చూసేవాళ్లకు, ఇతడి గురించి విన్నవాళ్లకు విచిత్రంగా అనిపిస్తున్నా, ఆయన మాత్రం ట్రంప్ పట్ల తన భక్తి నిజమైనదని చాటుతున్నాడు. ఇతడి పేరును కూడా ఊరి ప్రజల్లో బుస్స కృష్ణకు బదులుగా ట్రంప్ కృష్ణగా ముద్రపడిపోయింది. ట్రంప్ ఇండియా టూర్ షెడ్యూల్‌కు సంబంధించిన డీటేల్స్ ఇలా ఉన్నాయి
ట్రంప్ అంటే నచ్చని అమెరికన్లు, ఆయన ఫోటోను కొడుతూ, చించేస్తూ అక్కడ తమ నిరసనలు తెలియజేస్తుంటే, భారత్ లో మాత్రం ఇలాంటి అభిమాని ఉన్నాడని తెలిస్తే, ఇంకెంత ఆశ్చర్యపోతారో. మరి ఈ వీరభక్తుడికి ఈ రెండు రోజుల్లో తన ఇష్టదైవం ట్రంప్ దర్శనభాగ్యం కలుగుతుందో, లేదో చూడాలి,