Telugu States Rain Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎండల నుంచి ఊరట, మూడు నాలుగు రోజుల పాటు ఇదే మాదిరిగా వర్షాలు, కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ
గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జోరు వాన వల్ల వాతావరణం చల్ల బడింది. అయితే ఈ వానలు ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Hyd, May 9: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మండే ఎండల నుంచి ఉపశమనం లభించింది. గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. జోరు వాన వల్ల వాతావరణం చల్ల బడింది. అయితే ఈ వానలు ఇంకా మూడు నాలుగు రోజుల పాటు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. మరో రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురిసే అవకాశం ఉందని.. కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు మెరుపులతో కూడిన వడగళ్ల వర్షం కురవచ్చని పేర్కొంది. పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్. నాగర్ కర్నూల్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే చాన్స్ ఉందని తెలిపింది.
గంటకు 40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. కాగా రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం భారీ వర్షం కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షం ప్రభావంతో జిల్లాల్లో పంట నష్టపోయి రైతులు ఇబ్బంది పడగా హైదరాబాద్ నగరంలో తీ వ్ర ట్రాఫిక్‌జామ్‌లతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారు. తెలంగాణకు ఎల్లో అలర్ట్, వచ్చే ఐదు రోజులపాటు భారీ వర్షాలు, హైదరాబాద్‌లో రికార్డు స్థాయి వర్షపాతం నమోదు
తెలంగాణలో రానున్న 24 గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీల వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి, ములుగు, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. పలు చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఏపీలో వాతావరణం చాలా విచిత్రంగా మారింది. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జోరు వానలు కురుస్తున్నాయి. తమిళనాడు, తూర్పు విదర్భ, మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలోని రాయలసీమల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు వాతావరణం చల్లగా ఉంటుందని తెలిపింది. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయని అంచనా వేస్తున్నారు. భారీ వర్షాలు, బేగంపేటలో నాలాలో కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాలు, ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు
ఈ క్రమంలో ప్రకాశం, అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో గురువారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనివాతావరణ శౠఖ వెల్లడించింది. అంతేకాక చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ పిడుగులతో వానలకు అవకాశం ఉందని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
బుధవారం అనంతపురం, ప్రకాశం జిల్లా, తూర్పుగోదావరి, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, నంద్యాల జిల్లా, కడప జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 39 ప్రాంతాల్లో భారీ వానలు పడ్డాయి.ప్రకాశం జిల్లా మద్దిపాడులో 130.6 మిమీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 114.2 మిమీ అధిక వర్షపాతం నమోదైంది.
ఎన్నికలు జరగనున్న మే 13వ తేదీన కూడా తెలంగాణ, ఏపీల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న అక్కడక్కడ వర్షం కురిసింది. వర్షం కారణంగా పలు మార్కెట్ యార్డ్ లలో వేసిన పంటలు తడిసిపోయాయి.