Hyd, May 8: వేసవిలో ఎప్పుడూ లేనంతగా మంగళవారం తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం వరకు ఎండ ఉండగా, సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం ముంచెత్తింది. రాజధాని హైదరాబాద్‌లో మూడు గంటలపాటు కురిసిన భారీ వర్షం కురిసింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లు చెరువుల్లా మారడంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, బేగంపేటలో నాలాలో కొట్టుకు వచ్చిన రెండు మృతదేహాలు, ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ఎవరూ చెట్ల కిందకు వెళ్లవద్దని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాగవద్దని హెచ్చరించింది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే 100కి డయల్ చేయాలని కోరింది.రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ఏడుగురి మృతి చెందారు.
గడిచిన 10 ఏళ్లలో వేసవిలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గమనార్హం. . సాయంత్రం ఒక్కసారిగా కుండపోతగా వాన కురవడంతో రహదారులన్నీ ట్రాఫిక్‌తో స్తంభించిపోయాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా మియాపూర్‌లో 13.5, కూకట్‌పల్లిలో 11.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శేరిలింగంపల్లిలో 10.8 సెం.మీ, కేపీహెచ్‌పీలో 10.73, సికింద్రాబాద్‌లో 8.4, అల్వాల్‌లో 7 సెం.మీ, గాజులరామారంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నల్లగొండ, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో 6 సెం.మీపైగా వాన కురిసినట్టు తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు పడ్డాయి. . వర్షం పడుతుండగా విద్యుత్ స్తంభాన్ని తాకడంతో కరెంట్ షాక్, హైదరాబాద్‌లో ఓ వ్యక్తి మృతి, వీడియో ఇదిగో..
నిన్న కురిసిన వర్షానికి సగం నగరం అంధకారంలో ఉండిపోయింది. పలు ప్రాంతాల్లో 7 నుంచి 8 గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్లు స్విచాఫ్ కావడంతో పాటు ఇంటర్‌నెట్ వ్యవస్థ పని చేయకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో సంబంధాలు తెగిపోయాయి. పలు చోట్ల ఈదురు గాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈదురు గాలులకు హైదర్‌గూడలో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. రోడ్ నంబర్ 12 బంజారాహిల్స్ సబ్‌స్టేషన్‌లో పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌పై చెట్టు విరిగిపడింది.
రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో తొమ్మిది జిల్లాలకు హెవీ రైన్ అలర్ట్ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది. వీడియోలు ఇవిగో, హైదరాబాద్ నగరంలో పలుచోట్ల గంటకు పైగా వర్షం, రహదారులు జలమయం, పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
బుధవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమవడం, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్తు అంతరాయాలపై తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన అకడి నుంచే జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ పోలీస్ కమిషనర్ కే శ్రీనివాసరెడ్డి, ట్రాన్స్ కో సీఎండీ ఎస్‌ఏఎం రిజ్వీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.
భారీ వర్షాలు, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ముఖ్యమంత్రి.. వెంటనే సమస్యను పరిషరించి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో జలమయమైన కాలనీల్లో ప్రజలకు అవసరమైన చేయూతను అందించాలని సూచించారు.