YS Jagan Slams AP Govt: డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించిన జగన్, అక్రమాలు బయటపెడుతున్నందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని మండిపాటు

టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Jagan Slams AP Govt.jpg

Vjy, Oct 24: చంద్రబాబు కూటమి సర్కార్‌ ఎన్నికల హామీలు నెరవేర్చకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తోందని మండిపడ్డారు వైఎస్‌ జగన్‌. టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని మళ్లీ డైవర్షన్స్‌ మొదలుపెట్టారని చెప్పుకొచ్చారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్‌ జగన్‌ గుర్లలో డయేరియాతో​ మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ గుర్లకు వస్తున్నాడని తెలిసి మళ్లీ రాజకీయం చేస్తున్నారు. మా కుటుంబ విషయాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారు. వైఫల్యాలను డైవర్ట్‌ చేసేందుకే లడ్డూ అంశం తెరపైకి తెచ్చారు.

టీడీపీ అక్రమాలు, అన్యాయాలు బయటపెడుతున్నామని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. ఈసారి అమ్మ, చెల్లెలు ఫొటో పెట్టి రాజకీయం మొదలు పెట్టారు. కుటుంబ వ్యవహారాలను రాజకీయం చేస్తారా?. ఈనాడు, ఏబీఎన్‌, టీవీ-5, దత్తపుత్రుడు ఇప్పటికైనా మారాలి. మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నా.. మీ కుటుంబాల్లో ఇలాంటి గొడవలు లేవా?. ఇలాంటివి ప్రతీ ఇంట్లోనూ ఉండే విషయాలే. నిజాలు లేకున్నా వక్రీకరించడం ఇప్పటికైనా మానుకోండి. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టండి.

Jagan press Meet Videos

ప్రజల కష్టాల్లో పాలు పంచుకోండి. రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి వాటిని అరికట్టేందుకు దృష్టిసారించండి అని హితవు పలికారు. ఇదే సమయంలో విజయనగరంలో డయేరియాతో చనిపోయిన కుటుంబానికి రెండు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తున్నట్టు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. డయేరియాతో​ ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీనే ఇంత సాయం చేస్తుంటే.. బాధితులను పరామర్శిస్తుంటే.. ప్రభుత్వం నిద్ర మత్తులో ఉందా? అని మండిపడ్డారు.

జగన్‌కు ఇంకా తగ్గని క్రేజ్, వైసీపీ అధినేత వస్తున్నాడని జనసంద్రమైన గుంటూరు, వీడియో ఇదిగో..

డయేరియా బారినపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు?. స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. క్రమంలో బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం గుర్లలో వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామస్వరాజ్యం తీసుకొచ్చాం. గ్రామాలను సస్యశ్యామలం చేశాం. కూటమి ప్రభుత్వంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. ఈరోజు పరిస్థితులు చూస్తే దారుణంగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ హయంలో గ్రామ సచివాలయం ద్వారా సేవలు అందించాం. వివిధ శాఖలకు చెందిన సేవలు సత్వరమే అందించగలిగాం. అన్ని డిపార్టమెంట్ల సిబ్బంది అందుబాటులో ఉండేవారు.

గ్రామ సచివాలయాల్లో వివిధ శాఖ ఉద్యోగులు కనిపించేవారు. విలేజ్‌ క్లినిక్‌ల ద్వారా 24/7 వైద్య సేవలు అందుబాటులో ఉండేవి. విలేజ్‌ క్లినిక్‌లను పీహెచ్‌సీలతో అనుసంధానం చేశాం. ఏఎన్‌ఎంలు కనిపించేవారు. ప్రతీ గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ఉండేది. ప్రభుత్వం అలసత్వం కారణంగా గుర్లలో డయేరియాతో 14 మంది చనిపోయారు. ఇంత మంది చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదు. నేను ప్రశ్నించే వరకు డయేరియాపై ప్రభుత్వం స్పందించ లేదన్నారు.

..సెప్టెంబర్‌ 20వ తేదీన తొలి డయేరియా మృతి కేసు నమోదైతే 35 రోజులైనా ప్రభుత్వం స్పందించలేదు. అక్టోబర్‌ 19వ తేదీన నేను ట్వీట్‌ చేసే వరకు ప్రభుత్వం స్పందించలేదు. మృతుల సంఖ్యపైనా మంత్రులు, అధికారులు తలోమాట చెప్పారు. చంపా నదిలో​ దారుణమైన పరిస్థితిలో నీళ్లు ఉన్నాయి. వాటర్‌ స్కీమ్‌ మెయింటెనెన్స్‌ రెన్యువల్‌ కూడా చేయలేదు. పారిశుద్ధ్యంపై అశ్రద్ధ వహించారు.

ఈ ఐదు నెలల్లో కనీసం క్లోరినేషన్‌ కూడా చేయలేదు. గుర్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో 340 మంది చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో 100 మందికి పైగా చికిత్స అందుతోంది. మెరుగైన చికిత్స కోసం వేరే ఆసుపత్రులకు ఎందుకు తరలించలేదు?. విశాఖ, విజయనగరం ఆసుపత్రులకు ఎందుకు తీసుకెళ్లలేదు. స్కూల్‌ బెంచ్‌లపై వైద్యం చేస్తారా? అని ప్రశ్నించారు.