Guntur, Oct 23: రౌడీషీటర్ పైశాచిక దాడిలో మృతి చెందిన తెనాలి యువతి సహానా కుటుంబసభ్యులను పరామర్శిందుకు వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వెళ్లారు. వైఎస్ జగన్ జీజీహెచ్‌కు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ గుంటూరులో హెలికాప్టర్ దిగి ఆసుపత్రికి వెళ్తున్న మార్గంలో అభిమానులు భారీగా తరలివచ్చారు.
రౌడీషీటర్ నవీన్ దాడిలో తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్ డెడ్ కు గురైన యువతి సహానా (Sahana Murder) గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతూ మృతిచెందింది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీజీహెచ్(GGH) లో ఆమె మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సహానా కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. వైసీపీ తరపున ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ వివిధ దాడులలో మరణించిన ఆరుగురు ఆడపిల్లల కుటుంబాలకు పార్టీ తరపున రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతకు దిగజారిపోయాయో దళిత మహిళలను చూస్తే అర్థమవుతుందన్నారు. వైసీపీ హయాంలో ఆడవాళ్లకు భద్రత ఉండేదని, దిశ యాప్ (Disha App)తో ఆపదలో ఉన్న మహిళలకు అండగా నిలిచామని జగన్ అన్నారు. సహానా మృతికి కారణమైన నవీన్ టీడీపీకి చెందిన వాడని, అతను స్థానిక ఎంపీతో సన్నిహితంగా ఉండేవాడన్నారు. సీఎం చంద్రబాబు(CM Chandrababu)తో కలిసి దిగిన ఫొటోలు కూడా ఉన్నాయని, నిందితుడు తమపార్టీకి చెందినవాడు కావడంతోనే టీడీపీ నిస్సిగ్గుగా అతన్ని కాపాడాలని చూస్తోందని జగన్ ఆరోపించారు.
Jagan visits Guntur GGH
రౌడీ షీటర్ నవీన్ చేతిలో దాడికి గురై చికిత్స పొందుతూ మృతి చెందిన సహానా పార్ధీవదేహాన్ని సందర్శించడానికి గుంటూరు జీజీహెచ్ కు వెళ్తున్న మాజీ సీఎం వైయస్ జగన్ #YSJagan #JusticeForSahana #AndhraPradesh pic.twitter.com/7YPNjPfaC7
— Aadhan Telugu (@AadhanTelugu) October 23, 2024
నిందితుడు నవీన్ ను తెనాలి పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. టీడీపీకి, నవీన్ కు ఏ సంబంధం లేదని, సహానా - నవీన్ ల మధ్య అప్పు విషయమై జరిగిన గొడవే ఆమె హత్యకు దారితీసిందని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అంత క్లారిటీగా చెప్పినా వైసీపీ నేతలు.. ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.