Building Collapses: ప్రారంభించిన 10 రోజులకే కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఒకరు మృతి, మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం
సత్నా పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapses) ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న మరో ఇద్దరిని సహాయ సిబ్బంది రక్షించారు.
Satna, OCT 04: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి మూడంతస్తుల భవనం (3 Storey Building) కుప్పకూలింది. సత్నా పట్టణంలో మూడంతస్తుల భవనం కుప్పకూలిన (Building Collapses) ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఎస్‌డిఆర్‌ఎఫ్, పోలీసులు శిథిలాల తొలగింపు పనులు చేపట్టారు. భవన శిథిలాల్లో చిక్కుకున్న మరో ఇద్దరిని సహాయ సిబ్బంది రక్షించారు. మంగళవార్‌లోని బీహార్ చౌక్ సమీపంలో రాత్రి 10.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. గత 10 రోజులుగా భవనం వద్ద నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు,పరిపాలనా అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన కూలీలను ఆసుపత్రికి తరలించారు. భవనం కూలిపోవడానికి కారణాలు తెలియలేదు.