Tractor Rally Violence: రైతు ఉద్యమంలో చీలికలు, ఈ నిరసన నుంచి తప్పుకుంటున్నామని తెలిపిన ఏఐకేఎస్‌సీసీ, శాంతియుత నిరసన కొనసాగిస్తామని తెలిపిన వీఎం సింగ్, రాకేష్ తికాయత్‌తో సహా 200 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో కొన్ని రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆందోళన (Tractor Rally Violence) నుంచి తాము తప్పుకుంటున్నామని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) (All India Kisan Sangharsh Coordination Committee) వీఎం సింగ్‌ బుధవారం ప్రకటించడం కలకలం రేపుతోంది.

Tractor Rally Violence (Photo Credits: ANI)

New Delhi, Jan 27: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల ఉద్యమంలో చీలికలు ఏర్పడుతున్నాయి. రిపబ్లిక్ డే రోజున రైతులు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ హింసాత్మకంగా మారడంతో కొన్ని రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఆందోళన (Tractor Rally Violence) నుంచి తాము తప్పుకుంటున్నామని ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) (All India Kisan Sangharsh Coordination Committee) వీఎం సింగ్‌ బుధవారం ప్రకటించడం కలకలం రేపుతోంది.

రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ( Ongoing Farmers’ Protest) ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే రోజున జరిగిన హింస, ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎర్రకోట మీద జెండా ఎగరేసి ఏం సాధించారని ఆయన (VM Singh) మండిపడ్డారు. కోటపై నిషాద్ సాహెబ్ జెండా ఎగురవేసి దేశ గౌరవాన్ని మంట కలిపారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన సమయం కంటే ముందుగానే ఎందుకు బయలుదేరడంతోపాటు, అనుమతించిన మార్గాన్ని ఎందుకు ఉల్లంఘించారని మండిపడ్డారు.

ఢిల్లీలో ట్రాక్టర్ కింద పడి రైతు మృతి, తీవ్ర హింసాత్మకంగా మారిన ట్రాక్టర్ల ర్యాలీ, దేశ రాజధానిలో ఇంటర్నెట్, మెట్రో సేవలు బంద్

ఈ పరిణామాల నేపథ్యంలో తాము ఈ ఆందోళన (Farmers Protest) నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఎంఎస్‌పీపై చట్టబద్ధత సాధించే వరకు శాంతియుతమైన నిరసన చేపడతామని తెలిపారు. ప్రజలను కొట్టించడానికి చంపుకోవడానికి మేము ఇక్కడికి రాలేదు. కానీ ఈ నిరసనను కొందరు తప్పుదారి పట్టించాలని చూశారు. ముందుగా అనుకున్నదానికి భిన్నంగా నిరసనను ముందుకు సాగించలేం. రాకేష్ టికాయత్ అనే వ్యక్తితో మాకు సంబంధం లేదు. ఆయన సూచనలు మేం పరిగణలోకి తీసుకోం.

Here's The Tweet: 

అందుకే ప్రస్తుతం కొనసాగుతున్న నిరసన నుంచి మేం తప్పుకుంటున్నాం. అయితే కనీస మద్ధతు ధరపై చట్టబద్ధత సాధించే వరకు శాంతియుత నిరసన కొనసాగిస్తాం’’ అని వీఎం సింగ్ అన్నారు.దీనిపై రాకేష్ తికాయత్ (Rakesh Tikait) సమాధానం చెప్పాలని కూడా డిమాండ్‌ చేశారు. రిపబ్లిక్‌ డే రోజున ఢిల్లీలో రైతు ట్రాక్టర్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసకు సంబంధించి తనకు, తన సంస్థకు ఎటువంటి సంబంధం లేదని ఈ సందర్బంగా ఆయన వెల్లడించారు.

ఎవరీ దీప్ సిద్దూ.. రైతులను ఎందుకు రెచ్చగొట్టాడు, బీజేపీకి అతనికి సంబంధం ఏంటి ? ఎర్రకోటపై జెండాను ఎందుకు ఎగరవేశాడు, సిద్దూ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు, రైతు మృతికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజి విడుదల

72వ గణతంత్ర దినోత్సవంగా సందర్భంగా రైతు ఉద్యమకారులు చేపట్టిన ట్రాక్టర్ ‌ర్యాలీ హింసాత్మకంగా మారింది. ప్రధానంగా ర్యాలీగా వచ్చిన కొంతమంది ఎర్రకోటవైపు దూసుకురావడం, అక్కడ జెండా ఎగురవేయడం వివాదానికి దారి తీసింది. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర హోంశాఖ పావులు కదుపుతోంది.

చట్టాలు రద్దు చేయాల్సిందే, ఫిబ్రవరి 1న పార్లమెంట్ మార్చ్ తలపెట్టిన రైతు సంఘాలు, వివిధ ప్రాంతాల నుండి కాలి నడక ద్వారా పార్లమెంట్ వద్ద నిరసన, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పిన రైతులు

ఈ నేపథ్యంలో దాదాపు 200మంది ఆందోళన కారులను అదుపులోకి తీసుకున్న​ పోలీసులు, 22 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ముఖ్యంగా స్వరాజ్ అభియాన్‌నేత యోగేంద్ర యాదవ్‌తో పాటు దర్శన్ పాల్, రజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటా సింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ సహా మరికొందరిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

దేశ రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు, కిసాన్‌ ప‌రేడ్ కోసం ఢిల్లీలోకి ప్రవేశించిన వేలాది మంది రైతులు, మరోవైపు రాజ్‌ప‌థ్‌లో గ‌ణతంత్ర వేడుక‌లు

ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో యోగేంద్ర యాదవ్, ఇతర రైతు నేతలతో పాటు రాకేష్ తికాయిత్ కూడా ఉన్నారు. ర్యాలీకి సంబంధించి జారీ చేసిన 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' నిబంధనలను వీరు ఉల్లంఘించరంటూ ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు.ఎన్ఓసీని ఉల్లంఘించినందుకు ఎఫ్ఐఆర్ నమోదైన వారిలో రైతు నేతలు ధర్మన్ పాల్, రాజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, భూటా సింగ్ బుర్జిగిల్, జోగిందర్ సింగ్ ఉగ్రహ పేర్లు ఉన్నాయి' అని ఢిల్లీ పోలీసులు బుధవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.

యుద్ధభూమిగా మారిన ఢిల్లీ, 154 మంది పోలీసులకు గాయాలు, 15 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు, ఎంత మంది రైతులు గాయ‌ప‌డ్డారో ఇంకా తెలియని వైనం, హింసాత్మకంగా మారిన రైతుల కిసాన్ పరేడ్

హింసాత్మక ఘటనల నేపథ్యంలో కేంద్రం ఢిల్లీ వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేయడమే కాక రాజధానిలో అదనపు బలగాలను మోహరించించింది. ఎర్రకోట, జామా మసీద్‌ మెట్రో స్టేషన్లు మూసివేయడమే కాక సెంట్రల్‌ ఢిల్లీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇక నిన్న రాజధానిలో తలెత్తిన హింసాత్మక ఘటనలకు, తమకు ఎలాంటి సంబంధం లేదని రైతు సంఘాల నాయకులు ప్రకటించారు. కేంద్రం గందరగోళ పరిస్థితులను సృష్టించిందని.. అందువల్లే హింసాత్మక ఘటనలు తలెత్తాయి అని.. అల్లర్ల వెనక కుట్ర కోణం దాగి ఉందని వెల్లడించారు.